ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాప్చా కిల్లర్‌

ABN, First Publish Date - 2022-06-18T09:44:23+05:30

ఇంటర్నెట్‌ పరిచయం ఉన్న వ్యక్తులకు క్యాప్చాలు తెలిసే ఉంటాయి. ‘ట్రాఫిక్‌ లైట్స్‌ అన్నింటిపై క్లిక్‌ చేయండి’ ‘ఇంగ్లీష్‌ అక్షరాలు, అంకెలు, సింబల్స్‌ ఇలా అన్నీ కలగలిపినది’ చూసి టైప్‌ చేయండి అంటూ వస్తాయి. ఒక వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడానికి కావచ్చు, దరఖాస్తు నింపడానికి ముందైనా కనిపించవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్‌ పరిచయం ఉన్న వ్యక్తులకు క్యాప్చాలు తెలిసే ఉంటాయి. ‘ట్రాఫిక్‌ లైట్స్‌ అన్నింటిపై క్లిక్‌ చేయండి’ ‘ఇంగ్లీష్‌ అక్షరాలు, అంకెలు,  సింబల్స్‌ ఇలా అన్నీ కలగలిపినది’ చూసి టైప్‌ చేయండి అంటూ వస్తాయి. ఒక వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడానికి కావచ్చు, దరఖాస్తు నింపడానికి ముందైనా కనిపించవచ్చు. ఈ క్యాప్చాల సంగతి ఎక్కువ మందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది.  కొన్ని సందర్భాల్లో ఇది చికాకు కలిగించడమే కాకుండా, అది అర్థం కాకుండా టైమ్‌ కిల్‌ చేస్తుంటాయి. అయితే యాపిల్‌ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారం యాపిల్‌కు చెందిన ప్రైవేట్‌ యాక్సెస్‌ టోకెన్‌ ఫీచర్‌ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికించేలా ఉంది.

‘క్యాప్చా’(ఇఅ్కఖీఇఏఅ) పూర్తి రూపం ‘కంప్లీట్లీ ఆటోమేటెడ్‌ పబ్లిక్‌ ట్యూరింగ్‌ టెస్ట్‌ టు టెల్‌ కంప్యూటర్స్‌ అండ్‌ హ్యూమన్స్‌ అపార్ట్‌’. ఇది అందరికీ తెలిసిన సెక్యూరిటీ మెజర్‌. స్పామ్‌ నుంచి రక్షణ, అలాగే ఒక వ్యక్తి మాత్రమే ప్రాసెస్‌ చేస్తున్నాడని నిర్ధారించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతోంది. అయితే దీనికి భిన్నంగా ఉండే కొత్త ఫీచర్‌ను తీసుకురావాలనే ఆలోచనతో యాపిల్‌  ఉంది. ఈ పనిని తన డెవలపర్లకు పురమాయించింది.

ఈ ఏడాది జరిగిన డబ్ల్యుడబ్లుడీసీ సదస్సులో ప్రైవసీ యాక్సెస్‌ టోకెన్స్‌ను ప్రదర్శించారు. ఇవి చాలా శక్తిమంతమైన టూల్స్‌. హెచ్‌టీటీపీ అభ్యర్థనలు వచ్చినప్పుడు వ్యక్తుల గుర్తింపు తెలియజేయకుండా ప్రైవసీకి ఇవి రక్షణ కల్పిస్తున్నాయి.  ఐఔస్‌ 16, మాక్‌ఔస్‌ వెంటురాలో ఈ ఫీచర్‌ డెవలపర్లకు అందుబాటులో ఉంది. క్లౌడ్‌ఫ్లేర్‌ వంటి సెక్యూరిటీ సంస్థలతోనూ పనిచేస్తోంది. 

క్యాప్చాకు దీనికి ఉన్న తేడాను గుర్తించాల్సి ఉంది. క్లౌడ్‌ఫ్లేర్‌ ప్రకారం విజిట్‌ చేసిన వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌, మన ఐపీ తదితరాలన్నీ వెల్లడవుతాయి. అక్కడ జరిగిన ఇంటరాక్షన్‌ కూడా తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యూజర్‌ డేటా సేఫ్‌ కాదు. ప్రైవేట్‌ యాక్సెస్‌ టోకెన్స్‌లో యూఆర్‌ఎల్‌, ఐపీ మాత్రమే తెలుస్తాయి. ఏ వెబ్‌సైట్‌ విజిట్‌ చేసింది, ఇతర వివరాలను మాత్రం తెలుసుకోవడం కుదరదు.

Updated Date - 2022-06-18T09:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising