ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త సంవత్సరానికి... కేక్‌ వాక్‌..

ABN, First Publish Date - 2022-12-31T03:57:42+05:30

కొత్త సంవత్సరంలోకి మరికొద్ది గంటల్లో అడుగెడుతున్నాం. న్యూఇయర్‌ ఫ్లేవర్‌ అంటే కేక్స్‌ సందడే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త సంవత్సరంలోకి మరికొద్ది గంటల్లో అడుగెడుతున్నాం. న్యూఇయర్‌ ఫ్లేవర్‌ అంటే కేక్స్‌ సందడే. కేక్‌లంటే ముందుగా మనకు బేకరీలే గుర్తుకొస్తాయి. అయితే ఇంట్లోనే సులువుగా ఈ కేక్స్‌ను తయారు చేసుకోవచ్చు. నూతన సంవత్సరంలో సరికొత్త రుచులను ఆస్వాదించవచ్చు. ఆ కేక్సే ఇవి..

పంప్‌కిన్‌ పై కావాల్సిన పదార్థాలు

స్వీట్‌ పేస్ట్‌: వెన్న- 500 గ్రాములు, ఐసింగ్‌ సుగర్‌- 250 గ్రాములు, మైదా- 750 గ్రాములు, కోడిగుడ్లు- 2

పంప్‌కిన్‌ మిశ్రమం కోసం: గుమ్మడికాయ పేస్ట్‌- 300 గ్రాములు, మిల్క్‌ మెయిడ్‌- 100 గ్రాములు, చక్కెర- 200 గ్రాములు, దాల్చిన చెక్కపొడి- 50 గ్రాములు, హాజల్‌ నట్స్‌- 30 గ్రాములు, కార్న్‌ఫ్లోర్‌ -100 గ్రాములు

స్వీట్‌పేస్ట్‌ కోసం: వెన్న, ఐసింగ్‌ సుగర్‌ కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత మైదా, కోడిగుడ్లు సొన కలపి మిశ్రమం చేయాలి. ఈ పేస్ట్‌ను స్వీట్‌ పేస్ట్‌ అంటారు.

తయారీ విధానం

పంప్‌కిన్‌ పేస్ట్‌, మిల్క్‌ మెయిడ్‌, చక్కెర, దాల్చిన చెక్కపొడి, హాజల్‌ నట్స్‌, కార్న్‌ఫ్లోర్‌ను బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని డబుల్‌ బాయిలర్‌లో కుక్‌ చేసుకోవాలి. ఇది థిక్‌ అయ్యాక టార్ట్‌ బేస్‌లో ఫిల్‌ చేసి 175 డిగ్రీల సెంటీగ్రేడ్‌ దగ్గర బేక్‌ చేయాలి. బేకింగ్‌ సమయం 25 నిముషాలు.

లెమన్‌ టార్ట్‌

కావాల్సిన పదార్థాలు

వెన్న- 500 గ్రాములు, ఐసింగ్‌ సుగర్‌- 250 గ్రాములు, మైదా- 750 గ్రాములు,

కోడిగుడ్లు- 2

లెమన్‌ కర్డ్‌ కోసం: వెన్న-250 గ్రాములు, ఎగ్‌ యాక్‌- 300 గ్రాములు, స్విస్‌ న్యాచురల్‌ సుగర్‌- 250 గ్రాములు, నిమ్మరసం కోసం- 3 నిమ్మకాయలు.

తయారీ విధానం

ముందుగా స్వీట్‌ పేస్ట్‌ తయారీ

వెన్న, ఐసింగ్‌ సుగర్‌ బాగా కలిపి చిలక్కొట్టాలి. క్రీమీ అయ్యాక రెండు కోడిగుడ్ల సొనల్ని కలపాలి. బాగా మిక్స్‌ చేసుకోవాలి. మైదా వేసి మళ్లీ మిశ్రమాన్ని కలపాలి. ఈ స్వీట్‌ పేస్ట్‌ టార్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్ట్‌ను బేకింగ్‌ చేయాలి. బేకింగ్‌ టెంపరేచర్‌ డిగ్రీల 170 సెంటీగ్రేడ్‌, బేకింగ్‌ సమయం సుమారు 20 నిముషాలు.

లెమన్‌ కర్డ్‌ కోసం తీసుకున్న వెన్న, చక్కెరను కలిపి డబుల్‌ బాయిలర్‌లో వేస్తే వెన్న త్వరగా కరుగుతుంది. దీనికి కోడిగుడ్డు పచ్చసొన కలపాలి. దీనికి నిమ్మరసం జత చేయాలి. ఇదే లెమన్‌ కర్డ్‌. ఈ మిశ్రమాన్ని డబుల్‌ బాయిలర్‌లో వేసి వోక్‌ చేసుకోవాలి. లెమన్‌ కర్డ్‌ థిక్‌ అయ్యాక..

స్వీట్‌పే్‌స్టలో ఫిల్‌ చేసుకుంటే సరి.. లెమన్‌

టార్ట్‌ రెడీ! డచ్‌ ట్రఫిల్‌

కావాల్సిన పదార్థాలు

చాక్లెట్‌ స్పాంజ్‌ కోసం: కోడిగుడ్లు- 15, గ్రైన్‌ సుగర్‌- 400 గ్రాములు, కేక్‌ జెల్‌- 30 గ్రాములు, నూనె- 75 ఎం.ఎల్‌., నీళ్లు- 50 ఎం.ఎల్‌, కోకో పౌడర్‌ -50 గ్రాములు, మైదా- 500 గ్రాములు

తయారీ విధానం

కోడిగుడ్లు, చక్కెరను బాగా చిలక్కొట్టాలి. దీనికి కేక్‌ జెల్‌ను బాగా కలపాలి. నూనె, నీళ్లు, కోకో పౌడర్‌, మైదా అన్నీ మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. గ్రీజ్‌ బేకింగ్‌ ట్రే తీసుకుని దానిలో బటర్‌ పేపర్‌ ఉంచాలి. ఈ చాక్లెట్‌ స్పాంజ్‌ మిశ్రమాన్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద 25 నిముషాల పాటు బేక్‌ చేసుకోవాలి.

ట్రిఫిల్‌ కోసం: క్రీమ్‌- 1 కేజీ, చాక్లెట్‌- 2 కేజీలు, వెన్న- 50 గ్రాములు తీసుకోవాలి. మొదట క్రీమ్‌ను ప్రాపర్‌గా బాయిల్‌ చేయాలి. దీనికి చాక్లెట్‌ కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి వెన్న కలపాలి. ఆ తర్వాత స్పాంజ్‌ను రౌండ్‌ షేప్‌లో కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మూడు లేయర్లగా కట్‌ చేసుకోవాలి. ప్రతి లేయర్‌ను సుగర్‌ లేయర్‌, చాక్లెట్‌ ట్రిపిల్‌ లేయర్‌లో ముంచాలి. దీన్ని చాక్లెట్‌ ట్రిఫిల్‌తో కవర్‌ చేయాలి. ఇదే డచ్‌ ట్రిఫిల్‌.

రామకృష్ణ రెడ్డి

గోల్కొండ రిసార్ట్‌, హైదరాబాద్‌

7095693720

Updated Date - 2022-12-31T03:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising