ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Breastfeeding: తల్లిపాలు ఎందుకు శ్రేష్టం..? అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్నిసార్లు పాలివ్వాలి..!

ABN, First Publish Date - 2022-10-25T10:58:42+05:30

శిశువుకు సరైన విధంగా తల్లిపాలు అందాలంటే అందుకు తల్లి పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలి.

Breastfeeding
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి దాదాపు ఆరునెలల వయసు వచ్చే వరకూ పసిపిల్లలకు తల్లిపాలు అందించడం చాలా అవసరం. తల్లిపాలు బిడ్డకు పోషకాహారాన్ని అందిస్తుంది.

అందువల్ల శిశువుకు సరైన విధంగా తల్లిపాలు అందాలంటే అందుకు తల్లి పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. తల్లిపాలు శిశువును అలెర్జీల నుండి కాపాడుతుంది. విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వులతో నిండిని ఈ పాలు బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి.

కొన్నిరకాల బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని నిర్మించడానికి చిన్నపిల్లలకు యాంటీబాడీస్ కూడా తల్లిపాలలో ఉంటాయి. డాక్టర్స్ మొదటి ఆరునెలలు తల్లిపాలు ఇవ్వాలని సలహా ఇస్తారు. తల్లిపాలను ఈ సమయంలో అందించడం వల్ల పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ అనారోగ్యం, విరేచనాలు తక్కువగా ఉంటాయి. నాణ్యత పరంగా తల్లి పాలను శిశివు సులువుగా జీర్ణం చేసుకుంటుంది.

తల్లిపాలు ఎందుకు శ్రేష్టం..

తల్లి తన శిశువుకు కనీసం ఆరు నెలల పాటు తల్లిపాలను ఇవ్వాలి. ఆ తర్వాత ఘన పదార్థాలను చిన్నగా అలవాటు చేయాలి. కానీ అవకాశం ఉంటే రెండు సంవత్సరాల వరకూ తల్లిపాలను అందిచడం కూడా బిడ్డకు మంచిదే. అప్పుడే పుట్టిన శిశువుకు రోజుకు కనీసం 8 నుంచి 12 సార్లు తల్లిపాలను అందించడం మంచిది. పుట్టిన తరవాత బిడ్డ ఆకలిని బట్టి ఆహారాన్ని ఇవ్వాలి. వీళ్ళకు రాత్రిపూట నాలుగంటలకంటే ఎక్కువ సమయం ఆహారం అందకుండా ఉండకూడదు.

Updated Date - 2022-10-25T10:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising