ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తాన్ని శుద్ధి చేస్తుంది!

ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30

అల్లం పరోటాలు, బెల్లం రొట్టెలు, బెల్లంతో చేసిన బొబ్బట్లు, బెల్లంతో చేసిన టీ, కాఫీలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. చక్కెర కంటే బెల్లమే మేలని ఆహారనిపుణులు చెబుతారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లం పరోటాలు, బెల్లం రొట్టెలు, బెల్లంతో చేసిన బొబ్బట్లు, బెల్లంతో చేసిన టీ, కాఫీలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. చక్కెర కంటే బెల్లమే మేలని ఆహారనిపుణులు చెబుతారు. బెల్లం వల్ల జీర్ణాశయంలోని ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో మినరల్స్‌తో పాటు ఐరన్‌ ఉంటుంది. ఇది శరీరానికెంతో మేలు చేస్తుంది. రక్తం శుద్ధి చేసే గుణం బెల్లానికి ఉంది. ముఖ్యంగా జాయింట్‌ పెయిన్స్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది. చలికాలంలో బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఆ మాటకొస్తే ఏ కాలంలో అయినా సరే ఆహారంలో బెల్లంను చేర్చటం మంచిదే. ఒంట్లోని వేడిని తగ్గించటానికి బెల్లం పానకం చేసేవారు పెద్దలు. దీన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు కూడా. ఖర్చు కూడా లేదు. నెలసరి సమయంలో బెల్లంతో చేసిన ఆహారం తినటం వల్ల మహిళలకెంతో మంచిది. ఇది ఇన్‌స్టంట్‌ ఎనర్జీనిస్తుంది. ఇక చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. శరీరంలోని చెడును శుభ్రపరిచే న్యాచురల్‌ క్లీనర్‌ బెల్లం. ఇది చేసే అతి గొప్ప పని లివర్‌ మీద ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెల్లంలో జింక్‌, మాంగనీసు.. లాంటివి ఉంటాయి. ముఖ్యంగా దగ్గుని నివారించడంలో ముందుంటుంది. మొత్తానికి ఎన్నో రకాల ఫుడ్స్‌లో చక్కెర స్థానంలో బెల్లం చేరిస్తే సరి.. ఆరోగ్యానికెంతో మంచిది

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising