ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐస్‌ క్యూబ్స్‌తో అందం!

ABN, First Publish Date - 2022-06-23T08:24:04+05:30

ఐస్‌క్యూబ్స్‌తో ముఖంపై రుద్దితే మొదట రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మ ఆరోగ్యం కోసం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సహజమైన ఫేషియల్స్‌, స్క్రబ్స్‌తో చర్మ సౌందర్యాన్ని పొందటం కామన్‌. రొటీన్‌ స్కిన్‌కేర్‌ కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా ఐస్‌ క్యూబ్స్‌తో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. 


ఐస్‌క్యూబ్స్‌తో ముఖంపై రుద్దితే మొదట రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతమవుతుంది. తాత్కాలికంగా సూక్ష్మ రంధ్రాల పరిమాణం తగ్గుతుంది. అయితే సెన్సిటివ్‌ చర్మం ఉండే వారు ఐస్‌క్యూబ్స్‌ రుద్దకూడదు. 

గాయాలున్నప్పుడు ఐసింగ్‌ చేసినట్లే ఫేస్‌ విషయంలో కూడా అంతే. ఐసింగ్‌ చేస్తే లింఫోటిక్‌ సిస్టమ్‌ నుంచి ఫ్లూయిడ్స్‌ అధికంగా రాకుండా చేస్తాయి. దీంతో పాటు చర్మం ఉబ్బడం, స్వెల్లింగ్‌ లాంటివి ఆగిపోతాయు.

ఉదయంపూట ఫేస్‌ ఐసింగ్‌ చేయటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. 

కంటి కింద ఉబ్బినపుడు, కంటి తిత్తులమీద ఐసింగ్‌ చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. కంటి తిత్తులు జన్యుపరంగా వచ్చేవి అయితే మాత్రం ఐసింగ్‌ చేసినా మంచి మార్పు ఉండదు.

ఫేస్‌ ఐసింగ్‌ అంటే అదేదో సరికొత్త విషయం కాదు. మేకప్‌ వేసుకునే ముందు సెలబ్రిటీలు ఈ పద్ధతిని వాడుతారు. అలియాభట్‌, కత్రినా కైఫ్‌ ఐస్‌ క్యూబ్స్‌తో ముఖచర్మాన్ని అందంగా మలచుకుంటారు. ముఖ్యంగా రక్తనాళాలు ఈ చల్లదనం వల్ల సంకోచిస్తాయి. చూడటానికి బ్యూటిఫుల్‌ లుక్‌ కనిపిస్తుంది. 

ఐసింగ్‌ వల్ల ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపించరు. ఎందుకంటే చర్మ రంధ్రాలు ఓపెన్‌ అవుతాయి. చర్మంపై ముడతలు కనిపించవు. 

ఇలా కాకుండా చల్లని నీటిలో ముఖాన్ని తడపడం లేదా ఐస్‌క్యూబ్స్‌ను మెత్తని గుడ్డలో కట్టి చర్మంపై మసాజ్‌ చేయటం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. 

Updated Date - 2022-06-23T08:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising