ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూలతో అందం

ABN, First Publish Date - 2022-06-22T09:14:52+05:30

చర్మ సౌందర్యం పూలతో సాధ్యమే! అందుకోసం వాటితో తయారైన ఫేస్‌ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మ సౌందర్యం పూలతో సాధ్యమే! అందుకోసం వాటితో తయారైన ఫేస్‌ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు.

మల్లెపూలు: గుప్పెడు మల్లెపూల రేకులు, ఒక పెద్ద చెంచా పెరుగు, ఒక టీస్పూను చక్కెర తీసుకోవాలి. ముందుగా మల్లె రేకులను వేళ్లతో చిదిమి, పెరుగు, చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడల మీద అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

గులాబీలు: గుప్పెడు గులాబీ రేకులు తీసుకుని కప్పు నీళ్లలో మరిగించి వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి ఒక టీస్పూను గంధం పొడి, ఒక టీస్పూను పాలు చేర్చి ముఖం, మెడకు అప్లై చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

మందారం: గుప్పెడు మందారం పువ్వులు, 10 గులాబీ రేకులు, ఒక టేబుల్‌ స్పూను ముల్తానీ మట్టి, ఒక టేబుల్‌స్పూను పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం మీద అప్లై చేసి, ఆరిన తర్వాత తడిపి, వేళ్లతో రుద్దుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.


ఈ ఫ్లవర్‌ ప్యాక్‌లను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే ఉంటే చర్మం మచ్చలు తొలిగి, మెరుపు సంతరించుకుంటుంది.

Updated Date - 2022-06-22T09:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising