Adenoids Treatment: త్వరగా కోలుకోనే మార్గమిదే!
ABN, First Publish Date - 2022-12-14T22:32:08+05:30
మా పిల్లకు తరచూ జ్వరం వస్తోంది. జ్వరం రావటానికి ఇన్‌ఫెక్షన్లు కారణమని.. ఈ ఇన్‌ఫెక్షన్లకు కారణమయిన ఎడినాయిడ్స్‌ను తొలగించాలని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు.
ఎడినాయిడ్స్ చికిత్స
మా పిల్లకు తరచూ జ్వరం వస్తోంది. జ్వరం రావటానికి ఇన్‌ఫెక్షన్లు కారణమని.. ఈ ఇన్‌ఫెక్షన్లకు కారణమయిన ఎడినాయిడ్స్‌ను తొలగించాలని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. ఈ ఎడినాయిడ్స్‌ను తొలగించటం మంచిదేనా? ఒక వేళ తొలగిస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
-సుజాత, వరంగల్
మన ముక్కు కింది భాగంలో ఉండే గ్లాండ్స్‌ను ఎడినాయిడ్స్ అంటారు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం. మన ముక్కు లేదా నోటి ద్వారా క్రిములు మన వ్యవస్థలోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుపడతాయి. ఎడినాయిడ్స్ మనకు ఆరేళ్లు వచ్చేవరకూ పెరుగుతాయి. ఆ తర్వాత కుచించుకుపోతాయి. 16 ఏళ్లకు పూర్తిగా కనిపించకుండా పోతాయి. కానీ కొందరిలో ఈ ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు అవి వాచి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మందుల ద్వారా తగ్గనప్పుడు వీటిని చిన్న సర్జరీ ద్వారా తొలగిస్తారు. ఎడినాయిడ్స్‌ను తొలగించిన తర్వాత ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం..
గొంతు నుంచి సులభంగా జారిపోయే ఆహారాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు బంగాళదుంపల ముద్ద కూర, బాగా ఉడికించిన ఆకు కూరలు గొంతుకకు అడ్డం పడవు.
సర్జరీ అయిన తర్వాత పళ్ల రసాలను ఇవ్వటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. పిల్లలు వీటిని మారం చేయకుండా తాగుతారు.
ఎటువంటి పరిస్థితుల్లో వేడి పదార్థాలను ఇవ్వకూడదు.
బత్తాయి, నారింజ వంటి పళ్లను పెట్టకూడదు. వీటి వల్ల ఎలర్జీలు వచ్చే అవకాశముంటుంది. ఇదే విధంగా పులిసిన మజ్జిగను కూడా ఇవ్వకూడదు.
పిల్లలకు చిప్స్ వంటి జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు. కానీ సర్జరీ తర్వాత కొద్ది కాలం పాటు వీటిని తిననివ్వకూడదు. వీటిలో ఉండే కొన్ని రకాల రసాయనాల వల్ల ఎలర్జీలు వచ్చే అవకాశముంటుంది.
Updated Date - 2022-12-14T22:32:09+05:30 IST