ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన జెలన్‌స్కీ

ABN, First Publish Date - 2022-02-25T19:16:58+05:30

రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. కీవ్‌ వెలుపల రష్యా బలగాలను ఎదుర్కొంటున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కివ్: రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. కీవ్‌ వెలుపల రష్యా బలగాలను ఎదుర్కొంటున్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల్లో 450 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. కాగా రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఖండించారు. సైనిక లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లు రష్యా అవాస్తవాలు చెబుతోందన్నారు. అయితే రష్యాతో  పోరులో ఒంటిరిగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయమేదీ తమకు అందట్లేదని వాపోయారు.


రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసిందని వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందన్నారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

Updated Date - 2022-02-25T19:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising