ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీవ్‌లోనే ఉన్నా: జెలెన్‌స్కీ తాజా వీడియో

ABN, First Publish Date - 2022-03-08T18:36:35+05:30

రష్యా దాడులను శక్తివంచన లేకుండా తిప్పికొట్టేందుకు తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యా దాడులను శక్తివంచన లేకుండా తిప్పికొట్టేందుకు తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను కీవ్‌లోనే ఉన్నానని, అజ్ఞాతంలో లేనని తన తాజా ప్రసంగంలో పేర్కొన్నారు. 13వ రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఒక వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు. కీవ్‌లోని తన కార్యాలయంలోనే ఉన్నానని ఆ వీడియోలో ఆయన పేర్కొంటూ కార్యాలయం చుట్టుపక్కల దృశ్యాలను చూపించారు.


''కీవ్‌లోని బాంకోవ స్ట్రీట్‌లో ఉన్నాను. ఇందులో దాపరికాలు ఏమీ లేవు. నేను ఎవరికీ భయపడేది కూడా లేదు. మన దేశభక్తి పోరాటంలో విజయం సాధించేంత వరకూ భయపడేదే లేదు'' అని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. గత ఆదివారం రాత్రి కూడా జెలెన్‌స్కీ 'ఫర్‌గీవ్‌నెస్ సండే' సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడుతూ, రష్యా మారణకాండను ఉక్రెయిన్ ప్రజలు ఎప్పటికీ మరువరని, రష్యాని దేవుడు కూడా క్షమించడని అన్నారు. రష్యా చేసిన తప్పునకు 'డే' ఆఫ్ జడ్జిమెంట్ రోజున సమాధానం చెప్పక తప్పదన్నారు.

Updated Date - 2022-03-08T18:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising