ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు జడ్ కేటగిరి security cover

ABN, First Publish Date - 2022-06-24T17:50:16+05:30

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్ కేటగిరి భద్రత కల్పించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తో ‘జడ్’ కేటగిరీ సాయుధ భద్రతను కల్పించింది.యశ్వంత్ సిన్హా వచ్చే గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కేంద్ర మాజీమంత్రి సిన్హాను జూన్ 21వ తేదీన ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన తర్వాత,  యశ్వంత్ సిన్హా పేరు వెలుగులోకి వచ్చింది.మంగళవారం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైన సిన్హా పార్టీ పదవికి రాజీనామా చేశారు.


‘‘జాతీయ ప్రయోజనాల కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది.టీఎంసీలో మమతాజీ నాకు అందించిన గౌరవం, ప్రతిష్ఠకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి నేను పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె ఈ చర్యను ఆమోదిస్తారని అనుకుంటున్నాను’’ అని సిన్హా ట్వీట్ చేశారు.జూన్ 27వతేదీ గురువారం ఉదయం 11.30 గంటలకు సిన్హా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఇప్పటికే జడ్ ప్లస్  కేటగిరి భద్రత కల్పించారు.

Updated Date - 2022-06-24T17:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising