ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ సహకారం లేనందునే ఆలస్యం

ABN, First Publish Date - 2022-01-25T07:52:40+05:30

రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్ల తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులకుగాను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నిధులు, భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకు నిధులు, భూమి ఇవ్వండి

ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించండి

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ 


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్ల తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాలకు కేటాయించిన ప్రాజెక్టులకుగాను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నిధులు, భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారని.. ఆరోపణలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, భూమి ఇవ్వాలని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు రూ.2,420 కోట్లకు పెరిగాయని, ఏడేళ్లలో రైల్వే నెట్‌వర్క్‌ 194 రూట్‌ కి.మీ(356 ట్రాక్‌ కి.మీ) పెరిగిందని వివరించారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైను(151కి.మీ)కు రూ.100 కోట్లు, 342 హెక్టార్ల భూమి.. అక్కన్నపేట-మెదక్‌ (17.2కి.మీ)కు రూ.31కోట్లు, 1.02 హెక్టార్ల భూమిని అప్పగించాల్సి ఉందని తెలిపారు. భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి (53.2 కిమీ), కాజీపేట-బల్లార్ష మూడో లైను (201కి.మీ), కాజీపేట- విజయవాడ మూడో లైను(219.64 కిమీ), కాజీపేట-హసన్‌పర్తి(11.06కిమీ) బైపాస్‌ లైను, మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ లైను పనులకు భూసేకరణ పూర్తి చేయకపోవడం వల్ల ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. అలాగే, మణుగూరు-రామగుండం,కొండపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ భాగస్వామ్యంపై తెలంగాణ నుంచి స్పందన లేదని స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్‌, కరీంనగర్‌-హసన్‌పర్తి, బోధన్‌-లాథూర్‌ కొత్త లైన్ల నిర్మాణానికి సర్వే పూర్తయ్యిందని.. కానీ వఎంఎంటీఎ్‌సకు నిధులేవి?

ఎంఎంటీఎస్‌ రెండో దశలో యాదాద్రి వరకు లైను పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వనందు వల్లే ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.835 కోట్లు ఖర్చు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసిందని పేర్కొన్నారు. రూ.916.55 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,150 కోట్లకు చేరిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.760 కోట్లు ఇవ్వాల్సి ఉంటుదని స్పష్టం చేశారు.

్యయ భరింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంగీకారం తెలపలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-25T07:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising