ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేను పెళ్లి చేసుకోనున్న యంగెస్ట్ మేయర్

ABN, First Publish Date - 2022-02-16T22:10:42+05:30

సీపీఎం చిల్డ్రన్ వింగ్ అయిన ‘బాల సంఘా’నికి ఆర్య రాష్ట్ర అధ్యక్షులు. అలాగే ఎస్ఎఫ్ఐలో స్టేట్ కమిటీ సభ్యురాలు. 21 ఏళ్లకే తిరువనంతపురం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసి దేశంలోనే అతి చిన్న వయసుగల మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. 100 వార్డులు ఉన్న తిరువనంతపురం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: దేశంలోనే యంగెస్ట్ మేయర్‌గా గుర్తింపు పొందిన కేరళకు చెందిన ఆర్య రాజేంద్రన్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా యంగెస్ట్ ఎమ్మెల్యేనే. ప్రస్తుత కేరళ అసెంబ్లీలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన కేఎం సచిన్ దేవ్‌, ఆర్య రాజేంద్రన్‌ల పెళ్లి తొందరలోనే జరగనుంది. వీరిద్దరూ సీపీఎంకు చెందిన వారే. తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ 2020 డిసెంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి దేశంలో అతిచిన్న వయసు మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డుకెక్కారు. 2కేరళలోని బలుస్సెరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సచిన్ దేవ్ గెలుపొందారు. 15వ కేరళ అసెంబ్లీలో ఈయనే అతిచిన్న వయస్కుడు. ఆర్య వయసు 23 ఏళ్లు కాగా, సచిన్ వయసు 28 ఏళ్లు.


‘‘మేమిద్దరం ఒకే రాజకీయ భావజాలం కలిగినవాళ్లం. ఎస్ఎఫ్ఐలో (సీపీఎం విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ) ఉన్నప్పటి నుంచి కలిసి పని చేస్తున్నాం. అంతే కాకుండా మేమిద్దరం మంచి మిత్రులం కూడా. మా ఇరు కుటుంబాల్లో పెళ్లి గురించి చెప్పి అంగీకారం తీసుకున్నాం. మేమిద్దరం ప్రస్తుతం బాధ్యతాయుతమైన ప్రజా జీవితంలో ఉన్నాం. పార్టీ కూడా మాకు కుటుంబం లాంటిదే. అందుకే పార్టీలోని నేతలకు కూడా ఈ విషయంపై చర్చించాం’’ అని ఆర్య రాజేంద్రన్ అన్నారు. ఇప్పటికి తమ పెళ్లి తేది ఖరారు కాలేదని, అయిన మరుక్షణమే ప్రకటిస్తామని ఆమె అన్నారు.


సీపీఎం చిల్డ్రన్ వింగ్ అయిన ‘బాల సంఘా’నికి ఆర్య రాష్ట్ర అధ్యక్షులు. అలాగే ఎస్ఎఫ్ఐలో స్టేట్ కమిటీ సభ్యురాలు. 21 ఏళ్లకే తిరువనంతపురం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసి దేశంలోనే అతి చిన్న వయసుగల మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. 100 వార్డులు ఉన్న తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 52 స్థానాలు గెలుచుకున్నారు. ఇక సచిన్ దేవ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇతడు 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బలుస్సెరి(ఎస్సీ) నియోజకవర్గం నుంచి 20 వేల ఓట్ల మెజారిటితో గెలుపొందారు.

Updated Date - 2022-02-16T22:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising