ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యన్ చానళ్ళను యూరోపులో నిలిపేసిన యూట్యూబ్

ABN, First Publish Date - 2022-03-01T22:15:49+05:30

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. RT, Sputnik చానళ్ళ ప్రసారాలను యూరోపులో నిలిపేసింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 


‘‘RT, Sputnik యూట్యూబ్ చానళ్ళను యావత్తు యూరోపులో తక్షణం నిలిపేస్తున్నాం. ఈ నిర్ణయం పూర్తిగా అమల్లోకి రావడానికి మా సిస్టమ్స్‌కు కాస్త సమయం పడుతుంది’’ అని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ తెలిపింది. 


RT, Sputnik ప్రచురించే కంటెంట్‌ను యూరోపియన్ యూనియన్‌లో నిలిపేస్తున్నట్లు ఫేస్‌బుక్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 


RT, Sputnikలకు రష్యా ప్రభుత్వ మద్దతు ఉంది. వీటిని ఆ దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రభుత్వ బాకాలుగా పరిగణిస్తారు. పుతిన్ చేస్తున్న యుద్ధాన్ని సమర్థిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడాన్ని నిషేధిస్తామని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సుల వోన్ డెర్ లెయెన్ ఆదివారం ప్రకటించారు. 


Updated Date - 2022-03-01T22:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising