ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narendra Modi : ఈ వయసులో కళ్లజోడా?... ఓ విద్యార్థినితో మోదీ...

ABN, First Publish Date - 2022-10-01T21:19:45+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతోనూ, మెట్రో కన్‌స్ట్రక్షన్ వర్కర్లతోనూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముచ్చటించారు. ఆధునిక టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటారని విద్యార్థులను ప్రశ్నించారు. దీనిని నేర్చుకోవడం ఇబ్బందిగా ఉందా? అని వర్కర్లను అడిగారు. అనంతరం సొరంగాన్ని వర్చువల్ విధానంలో పరిశీలించారు. 


మోదీ శనివారం ఢిల్లీలోని ప్రగతి మైదానంలో 5జీ స్పెక్ట్రమ్ సేవలను, 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC)ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. అహ్మదాబాద్‌లోని రూప్‌దా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో జరిగిన సంభాషణ ఏమిటంటే...


మోదీ : ఈ వయసులో నీకు కళ్లజోడు ఉంది! నువ్వు చాలా శ్రద్ధగా చదువుతున్నట్లుంది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఏ సబ్జెక్ట్ చదవాలని కోరుకుంటున్నావు? 


విద్యార్థిని : సైన్స్


మోదీ : మీ ఎదుట టీచర్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్‌ను గ్రహించడానికి ఇబ్బందిగా ఉందా? 


విద్యార్థిని : లేదు


మోదీ : మీ దగ్గర టీచర్ లేకపోతే కాసేపు బయటికెళ్ళి ఆడుకోవాలని అనిపించదా? ఈ డిజిటల్ థింగ్ కూడా అలాంటి సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వొద్దా?


విద్యార్థిని : ఔను అన్నట్లుగా తల ఊపింది. 


విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత మోదీ ఢిల్లీ మెట్రో కన్‌స్ట్రక్షన్ వర్కర్లతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. అనంతరం సొరంగాన్ని కూడా వర్చువల్ విధానంలో పరిశీలించారు. కన్‌స్ట్రక్షన్ వర్కర్‌తో మోదీ సంభాషణ ఎలా సాగిందంటే...


మోదీ : కొత్త టెక్నాలజీ ఎలా ఉంది? దీన్ని నేర్చుకోవడం కష్టమా?


వర్కర్‌ : లేదు సార్. ఈ టెక్నాలజీని మాకు సులువైన విధానంలో నేర్పిస్తున్నారు.


Updated Date - 2022-10-01T21:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising