ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NEET-PG seats : వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు... కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం...

ABN, First Publish Date - 2022-06-08T20:10:38+05:30

ఈ ఏడాది 1,450 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఖాళీగా ఉంటుండటంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఈ ఏడాది 1,450 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఖాళీగా ఉంటుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ సీట్ల (Medical Seats)ను ఖాళీగా ఉంచుతుండటం సరికాదని అంటూ, ‘‘మీరు వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. 


అదనంగా మాప్ అప్ కౌన్సెలింగ్ (Mop-up Counselling) నిర్వహించి ఈ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee)ని ఆదేశించింది. వైద్యుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకుంటున్నందుకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. కనీసం ఒక్క సీటు ఖాళీగా ఉన్నా, దానిని భర్తీ చేయాలని, వృథా కానివ్వరాదని తెలిపింది. విద్యార్థులకు ప్రవేశం కల్పించకపోతే, వారి భవిష్యత్తు, జీవితాలతో ఆడుకుంటున్నందుకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


NEET-PG 2021-22 చివరి మాప్ అప్ కౌన్సెలింగ్ మే 7న ముగిసింది. 1,456 మెడికల్ పీజీ సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. స్పెషల్ స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించి ఈ సీట్లను భర్తీ చేయాలని ఏడుగురు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. 


‘‘మీకు (కేంద్ర ప్రభుత్వానికి) చాలా మంది డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు అవసరమైనపుడు, ఈ సీట్లను ఖాళీగా ఉంచుకోవడం వల్ల మీకు ఏం వస్తుంది? మీరు మరొక మాప్ అప్ రౌండ్ నిర్వహించి ఉండవలసింది. బాధ్యత ఉందని భావిస్తున్నారా? ప్రతిసారీ కోర్టు జోక్యం చేసుకోవలసి వస్తోంది. కోర్టు ఆర్డర్ కోసం ఎందుకు వేచి చూస్తున్నారు? వైద్యుల భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన విషయం ఇది. మీరు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, మన దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది’’ అని ధర్మాసనం మండిపడింది. 


Updated Date - 2022-06-08T20:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising