ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP Elections: అఖిలేష్ పోటీపై స్పందించిన సీఎం యోగి

ABN, First Publish Date - 2022-01-19T22:13:42+05:30

అనంతరం యోగి మాట్లాడుతూ ‘‘పోటీ చేయాలనుకున్నవారు పోటీ చేయవచ్చు. అలాగే అఖిలేష్ కూడా పోటీ చేయొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అనుకున్నంత బలంగా లేదు. ఆ పార్టీ చాల వెనుకబడి ఉంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో్ పోటీకి సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అఖిలేష్ పోటీ చేయాలని అనుకుంటే చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజలు కోరితే అజాంగఢ్ నుంచి పోటీ చేస్తానని అఖిలేష్ ప్రకటించారు.


అనంతరం యోగి మాట్లాడుతూ ‘‘పోటీ చేయాలనుకున్నవారు పోటీ చేయవచ్చు. అలాగే అఖిలేష్ కూడా పోటీ చేయొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అనుకున్నంత బలంగా లేదు. ఆ పార్టీ చాల వెనుకబడి ఉంది. నిజానికి ఐదేళ్ల మా పాలనలో మాఫియా, గూండాలను రాష్ట్రం బయటికి తరిమికొట్టాం. అయితే జైల్లో వేశాం. కానీ సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గూండాలను, మాఫియాను మళ్లీ దింపుతోంది. ఆ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో అందరూ వారే ఉన్నారు’’ అని అన్నారు.


ఇక భారతీయ జనతా పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ చేరికపై యోగి మాట్లాడుతూ ‘‘అపర్ణా యాదవ్ చేరిక పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. మోదీ డబుల్ ఇంజన్ పనిని గుర్తించి ఆమె పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.

Updated Date - 2022-01-19T22:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising