ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసిన యోగి

ABN, First Publish Date - 2022-04-20T23:58:04+05:30

యూపీలో పెరుగుతున్న కరోనా కేసులను మరింత పెరగకుండా కట్టడి చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: యూపీలో పెరుగుతున్న కరోనా కేసులను మరింత పెరగకుండా కట్టడి చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయం, ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే లక్నో టోల్ ప్లాజా వద్ద కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. లక్నోలో కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.


ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం ప్రకారం, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చీఫ్ మెడికల్ అధికారి ఆదేశాలు ఇచ్చారు. బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని, జెనోమ్ సీక్వెన్సింగ్ (పాజిటివ్‌గా నిర్ధారణ అయితే) నిర్వహించాలని కూడా ఆదేశించారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్, హర్యానా, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారు లక్నోలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.


అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు

దేశంలోని కొన్ని సీటీల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇన్పెక్షన్ వ్యాప్తిపై నిరంతర పర్యవేక్షణ జరపాలని, సమర్ధవంతంగా కోవిడ్ మేనేజిమెంట్ చర్యలు చేపట్టాలని సూచించింది.

Updated Date - 2022-04-20T23:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising