ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi Adityanath: ఆ ఇద్దరు నేతలు Same to Same

ABN, First Publish Date - 2022-06-01T01:27:01+05:30

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారంనాడు అసెంబ్లీలో కొద్దిసేపు నవ్వులు పూయించారు. అసెంబ్లీలో విపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మంగళవారంనాడు అసెంబ్లీలో కొద్దిసేపు నవ్వులు పూయించారు. అసెంబ్లీలో విపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌కు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. ''మీకూ (అఖిలేష్), రాహుల్ గాందీకి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఒకరేమో దేశాన్ని విదేశాల్లో విమర్శిస్తుంటారు. మరొకరు (అఖిలేష్) యూపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లి యూపీని విమర్శింటారు'' అని యోగి ఛలోక్తి విసిరారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి. ఆ సమయంలో అఖిలేష్ కూడా అసెంబ్లీలోనే ఉన్నారు.


దీనికి ముందు, సోమవారంనాడు అసెంబ్లీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, యూపీలో విద్యావ్యవస్థ బాగోలేదన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఒక పాఠశాలకు వెళ్లి తానెవరో చెప్పాలని ఒక విద్యార్థిని అడిగినప్పుడు ఆ విద్యార్థి రాహుల్ గాంధీ అని చెప్పాడని తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలకే యోగి తాజాగా కౌంటర్ ఇచ్చారు. మీ ఇద్దరి నేతల మధ్య పెద్దగా వ్యత్యాసమేమీ లేదని, ఒకరు దేశాన్ని (రాహుల్) దేశం వెలుపల, మరొకరు (అఖిలేష్) యూపీని యూపీ వెలుపల విమర్శిస్తుంటారని సెటైర్ వేశారు.

Updated Date - 2022-06-01T01:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising