ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పటేల్ మాకు, జిన్నా వాళ్లకు: యోగి ఆదిత్యనాథ్

ABN, First Publish Date - 2022-01-28T20:12:29+05:30

పాకిస్థాన్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: పాకిస్థాన్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎండగట్టారు. సర్దార్ పటేల్ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తుంటే, సమాజ్‌వాదీ పార్టే నేత మాత్రం పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలి జిన్నాను ఆరాధిస్తున్నారని ఓ ట్వీట్‌లో విమర్శించారు.


''వాళ్లు జిన్నా ఆరాధకులు. మేము సర్దార్ పటేల్‌ను అభిమానిస్తాం. పాకిస్థాన్ అంటే వాళ్లకు చాలా ఇష్టం. మేము మా భారతి కోసం ప్రాణాలిస్తాం'' అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. దీనికి ముందు, పాకిస్థాన్ రాజకీయ శత్రువు మాత్రమేనని, బీజేపీ ఓటు బ్యాంకు రాజీకీయాలకు పాల్పడుతోందని అఖిలేష్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడే జిన్నా పేరును ఎందుకు లేవనెత్తుతారో తనకు అర్ధం కావడం లేదని, తాము రైతుల గురించి మాట్లాడుతుంటే, వాళ్లు జిన్నా ప్రస్తావన చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీతో మొదలై ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-28T20:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising