ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yediyurappa: ఎన్నికల్లో పోటీకి దూరం...

ABN, First Publish Date - 2022-07-23T01:30:19+05:30

బీజేపీ సీనియర్ నేత, నాలుగు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప త్వరలోనే ప్రత్యక్ష ఎన్నికలకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, నాలుగు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప త్వరలోనే ప్రత్యక్ష ఎన్నికలకు స్వస్తి చెప్పనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నియోజవర్గాన్ని తాను వదులుకుంటున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. తన కుమారుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలిపారు.


''నేను పోటీ చేయడం లేదు. షికారిపుర నుంచి విజయేంద్ర నిలబడతాడు. నాకంటే ఎక్కువ మెజారిటీతో విజయేంద్రను గెలిపించాలని షికారిపుర ప్రజలను వేడుకుంటున్నాను'' అని యడియూరప్ప అన్నారు. ఓల్డ్ మైసూరు నుంచి పోటీ చేయాలని విజయేంద్ర అభిమానులు కోరుకుంటున్నారనే విషయంపై అడిగినప్పుడు, అక్కడ్నించి పోటీ చేయాలనే గట్టి ఒత్తిడి విజయేంద్రపై ఉందని, అయితే తాను షికారిపురను వెకేట్ చేయడం, పోటీకి దూరంగా ఉండాలనుకోవడంతో అక్కడ్నించే విజయేంద్ర పోటీ చేస్తారని యడియూరప్ప సమాధానమిచ్చారు.


బీజేపీ ఉపాధ్యక్షుడుగా 2020 జూలైలో విజయేంద్ర నియమితుడయ్యాడు. దానికి ముందు బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018 మే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి ఆయన టిక్కెట్ ఆశించినప్పటికీ పార్టీ నిరాకరించింది. అయితే, ఆ తర్వాత కేఆర్ పేట్, సిరా అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019, 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో విజయేంద్ర కీలక పాత్ర పోషించారు. దాంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది.

Updated Date - 2022-07-23T01:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising