ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి 130 సీట్లు ఖాయం

ABN, First Publish Date - 2022-03-11T16:33:02+05:30

రాష్ట్రంలో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి 130 సీట్లు ఖాయమని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల శాసనసభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప


బెంగళూరు: రాష్ట్రంలో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి 130 సీట్లు ఖాయమని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకుందని ఇకనైనా ఆ పార్టీ తీరు మార్చుకుంటే మంచిదని హితవు  పలికారు. గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కాపలా కాసేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పరుగులుతీ యడం చూస్తుంటే కాంగ్రెస్‌కు ఎలాంటి గతి పట్టిందో అర్ధమవుతోందన్నారు. కాగా బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతామని అయితే పార్టీ సిద్ధాంతాలపై మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచాల్సిందేన్నారు. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహహరితంగా ఉన్నారని చెప్పారు. కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాతోనే ప్రభుత్వం ముందుకువెళుతోందన్నారు. ప్రధాని మోదీ విజన్‌తోనే దేశంలో బీజేపీ ముందుకు దూసుకుపోతోందని, కాంగ్రెస్‌కు కాలం చెల్లిందన్నారు.

Updated Date - 2022-03-11T16:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising