ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు Yashwant Sinha నామినేషన్

ABN, First Publish Date - 2022-06-25T16:16:40+05:30

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా శనివారం నామినేషన్ వేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ (Delhi): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) శనివారం నామినేషన్ (Nomination) వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ (TRS) నేతలు హాజరుకానున్నారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు లేదా లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా యశ్వంత్ హైదరాబాద్ వస్తే కాంగ్రెస్‌తో కాకుండా విడిగా భేటీ కావాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో ఆయనతో సీఎం కేసీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.


కాగా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును బీజేపీ రంగంలోకి దించడం ప్రతిపక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. ముర్ము అభ్యర్ధిత్వంపై ప్రధాని మోదీ చర్చించగానే ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ భేషరతుగా మద్దతు ప్రకటించారు. ఆదివాసీ పార్టీ, యూపీఏ భాగస్వామి జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) సైతం డైలమాలో పడింది. ద్రౌపదిలాగే ఆ పార్టీ అధినేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ సంతాలీ గిరిజన తెగకు చెందినవారు. ముర్ము ఆరేళ్లకుపైగా జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేశారు. జేఎంఎం ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఎస్టీలే. పార్టీ ఆమెకు మద్దతివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందుతుందన్నది హేమంత్‌ భయం. 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ గద్దెనెక్కిన ఛత్తీస్‌గఢ్‌ జనాభాలో 30శాతం మంది ఎస్టీలే. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరులో ఎన్నికలు ఉన్నాయి. తమ ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపదికి ఓటేస్తారని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆందోళనగా ఉంది. 

Updated Date - 2022-06-25T16:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising