ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SCO Summit : భారత్‌కు మద్దతిస్తాం : జీ జిన్‌పింగ్

ABN, First Publish Date - 2022-09-16T21:05:08+05:30

వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (SCO) అధ్యక్ష పదవిలో భారత దేశాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్) : వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (SCO) అధ్యక్ష పదవిలో భారత దేశాన్ని నియమించడానికి మద్దతిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) చెప్పారు. ఎస్‌సీఓ సదస్సులో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగించిన అనంతరం జిన్‌పింగ్ తన మద్దతును ప్రకటించారు. 


‘‘వచ్చే ఏడాది ఎస్‌సీఓకు అధ్యక్షత వహిస్తున్నందుకు భారత దేశానికి అభినందనలు. వచ్చే ఏడాది ఎస్‌సీఓ ప్రెసిడెన్సీకోసం భారత దేశానికి మేం మద్దతిస్తాం’’ అని జిన్‌పింగ్ చెప్పారు. అంతర్జాతీయ వ్యవస్థ మరింత న్యాయంగా, హేతుబద్ధంగా అభివృద్ధి చెందేవిధంగా ప్రపంచ నేతలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. నిష్ప్రయోజనకరమైన పనులను, కూటమి రాజకీయాలను వదిలిపెట్టాలన్నారు. ఐక్యరాజ్య సమితిని ఆసరాగా తీసుకుని అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. 


రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కూడా భారత దేశానికి అభినందనలు తెలిపారు. పుతిన్, మోదీ శుక్రవారం సాయంత్రం సమావేశమవుతారు. 


Updated Date - 2022-09-16T21:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising