ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా దాడిలో ప్రపంచపు అతిపెద్ద విమానం ధ్వంసం

ABN, First Publish Date - 2022-02-28T19:48:31+05:30

రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్‌లో భారీ నష్టానికి కారణమవుతున్నాయి. తాజాగా రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రపంచ అతిపెద్ద విమానం ఏఎన్225 ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డిమిట్రో కులేబా ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్‌లో భారీ నష్టానికి కారణమవుతున్నాయి. తాజాగా రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రపంచ అతిపెద్ద విమానం ఏఎన్225 ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డిమిట్రో కులేబా ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం పార్క్ చేసి ఉండగా, రష్యా ప్రయోగించిన ఒక మిస్సైల్ విమానాన్ని తాకింది. దీంతో విమానం కొంతమేర ధ్వంసమైంది. కాగా, ఈ విమానం ఎంత వరకు ధ్వంసమైందో ఇప్పుడే చెప్పలేమని, సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోందని, ఆ తర్వాతే ఈ నష్టంపై ఒక అంచనాకు రాగలమని ఉక్రెయిన్ తెలిపింది. ఏఎన్ 225 విమానం పేరు ‘మ్రియా’. ఉక్రెయిన్ భాషలో దీనికి కల అని అర్థం. ఇది ఆరు ఇంజిన్లు కలిగిన కార్గో విమానం. ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ అనే సంస్థ ఈ విమానాన్ని తయారు చేసింది. రష్యన్లు తమ కల (విమానం)ను ధ్వంసం చేయగలరేమో కానీ, స్వేచ్ఛగా, మరింత బలంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదగాలనుకునే తమ దేశపు కలను ధ్వంసం చేయలేరని డిమిట్రో తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

Updated Date - 2022-02-28T19:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising