డాక్టర్ ఆదిజ్యోతిబాబుకు ‘వరల్డ్ రికార్డు అవార్డు’
ABN, First Publish Date - 2022-11-13T11:04:55+05:30
వైద్య రంగంలోని మందులకు కూడా నయంకాని వ్యాధులకు ‘పంచభూత చికిత్స’ పేరుతో చేసే విధానాన్ని కనుగొన్న డాక్టర్ ఆది జ్యోతి బాబుకు ‘వరల్డ్ రికార్డు
అడయార్(చెన్నై), నవంబరు 12: వైద్య రంగంలోని మందులకు కూడా నయంకాని వ్యాధులకు ‘పంచభూత చికిత్స’ పేరుతో చేసే విధానాన్ని కనుగొన్న డాక్టర్ ఆది జ్యోతి బాబుకు ‘వరల్డ్ రికార్డు అవార్డు’(World Record Award)ను ప్రదానం చేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్, డాక్టర్ అబ్దుల్ కలాం విజన్ ఇండియా మూవ్‌మెంట్స్, తమిళనాడు అఛీవర్స్ కాన్ఫరెన్స్‌లు సంయుక్తంగా కలిసి ‘పాత్ బ్రేకింగ్ మెడికల్ ఇన్వెషన్షన్’ పేరుతో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం నగరంలోని రాజా అన్నామలై మండ్రంలో నిర్వహించాయి. ఈ పంచభూత చికిత్సా విధానాన్ని గుర్తిస్తూ యూఎ్‌సఏకు చెందిన ‘వరల్డ్ రికార్డ్స్ యూనియన్’ తరపున అఫీషియల్ రికార్డ్స్ ఆఫీసర్ క్రిస్టోఫర్ టేలర్, షరీఫాలు కలిసి ధృవీకరణ పత్రాన్ని అందజేశాయి. కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు టి.మదివాణన్, వెంకటేశన్, అబ్దుల్ కలాం శాస్త్రీయ మాజీ సలహాదారుడు డాక్టర్ వి.పొన్‌రాజ్, పులియంతోపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఈశ్వరన్, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ రాజారాం, సినీ దర్శకుడు, మాటల రచయిత లియాకత్ అలీఖాన్, తమిళ నటుడు చిన్ని జయంత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 40 మందికిపైగా శాస్త్రవేత్తలు, సోషల్ వర్క్‌తో సహా వివివిధ రంగాలలో తమ ప్రతిభను చాటిన వారిని తమిళనాడు అఛీవర్స్ అవార్డులతో సత్కరించారు.
Updated Date - 2022-11-13T11:04:57+05:30 IST