ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Work From Homeకు స్వస్తి

ABN, First Publish Date - 2022-07-06T16:12:07+05:30

కొవిడ్‌ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వ్యవస్థలన్నీ గాడినపడుతున్నాయి. రెండు సంవత్సరాలకుపైగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - ఐటీబీటీ కంపెనీల కసరత్తు 


బెంగళూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వ్యవస్థలన్నీ గాడినపడుతున్నాయి. రెండు సంవత్సరాలకుపైగా వర్క్‌ఫ్రం హోంను ప్రోత్సహించిన పలు ఐటీ, బీటీ కంపెనీలు ఇక ఇందుకు స్వస్తి పలికే సన్నాహాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులను మళ్లీ భౌతిక విధుల్లోకి హాజరు కావాల్సిందిగా సూచనలు చేస్తున్నాయి. ఇప్పటికే 50కు పైగా ప్రముఖ ఐటీ బీటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ 50 శాతానికిపైగా సిబ్బంది వర్క్‌ ఫ్రం హోం ద్వారానే సేవలందిస్తున్నారు. కొన్ని కంపెనీలు వారంలో 2-3రోజుల పాటు వర్క్‌ఫ్రం హోంకు అనుమతి ఇస్తున్నాయి. ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో నేరుగా విధుల నిర్వహణ కోసం సన్నద్ధం కావాల్సిందిగా తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాజధాని బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీ మరింతగా పెరగడంతోపాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలు మరింతగా ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-07-06T16:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising