ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కంపెనీల్లో... ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పొడిగింపు...

ABN, First Publish Date - 2022-01-13T21:17:27+05:30

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోన్న నేపధన్యంలో... ఆయా రంగాల్లోని కంపెనీలు... ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోన్న నేపధన్యంలో... ఆయా రంగాల్లోని కంపెనీలు...  ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తున్నాయి. నిరుడు చివరలో కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ తదితర పరిణామాల నేపధ్యంలో... ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు జనవరి నుండి ‘రిటర్న్ టు ఆఫీస్(ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించడం) ప్రక్రియను చేపట్టిర విఫమం తెలిసిందే. అయితే... అంతలోనే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో... మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా యోచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 31 కోట్లకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో మొత్తం కరోనా కేసులు 36 లక్షలకు చేరుకున్నాయి. దేశంలో ప్రతీరోజు కొత్తగా 2.47 లక్షల కేసులు నమోదవుతున్నాయి.


కాగా... గతేడాది మే నెల నుండి ఇదే గరిష్టం. ఈ క్రమంలో...  పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తున్నాయి. అమెజాన్ నుండి మొదలుకుని పలు అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు కాగ్నిజెంట్, దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వరకు అన్ని సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను  పొడిగిస్తున్నాయి. టీసీఎస్ జనవరి నుండి 50-70 శాతం వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండాలని భావించినప్పటికీ... ఒమిక్రాన్ ప్రభావం నేపధ్యంలో... ఈ కంపెనీలకు చెందిన దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తున్నారు. ఇక మరికొంత కాలంపాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-13T21:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising