ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

National family health survey: ఆ రాష్ట్రాల్లో మహిళలకే లైంగిక భాగస్వాములు ఎక్కువ!

ABN, First Publish Date - 2022-08-19T23:29:25+05:30

దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు(Sexual partners) ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(National family health survey) లెక్కల్లో తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. పురుషుల కంటే మహిళలకే సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు(Sexual partners) ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(National family health survey) లెక్కల్లో తేలింది. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, లఢఖ్, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చెరీ, తమిళనాడులోని మహిళలు ఈ విషయంలో పురుషులకంటే ముందున్నారు. ఇక రాజస్థాన్‌లో(Rajasthan) అత్యధికంగా ప్రతి మహిళకు సగటున 3.1 మంది లైంగిక భాగస్వాములుండగా.. పురుషుల విషయంలో ఈ సంఖ్య 1.8గా ఉంది. అయితే.. జీవిత భాగస్వామి లేదా సహజీవనం చేస్తున్న వ్యక్తితో కాక ఇతరులతో సెక్స్‌లో పాల్గొన్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఇలాంటి సంబంధాలున్న పురుషుల వాటా 4 శాతం కాగా.. మహిళల వాటా మాత్రం 0.5 శాతం. 


మొత్తం 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేకు మునుపు సంవత్సర కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం నిర్వహించారు.  2019-21 మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5ని నిర్వహించారు. మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. దేశ ప్రజల ఆర్థిక సామాజిక నేపథ్యానికి సంబంధించి సమాచారాన్ని సర్వేలో సేకరించారు. ప్రజల అభ్యున్నతి కోసం పథకాల రూపకల్పనలో సర్వే సమాచారాన్ని ప్రభుత్వం వినియోగిస్తుంది.

Updated Date - 2022-08-19T23:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising