ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడి కోసం Bangladesh నుంచి India కి ఈదుకుంటూ వచ్చిన యువతి.. పెళ్లైన 3 రోజులకు జరిగిందిదీ..

ABN, First Publish Date - 2022-06-01T01:54:33+05:30

ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న 22 ఏళ్ల బంగ్లాదేశీ యువతి దుస్సాహసమే చేసింది. కోల్‌కతాలో ఉంటున్న ప్రియుడి కోసం భారత్ - బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న 22 ఏళ్ల బంగ్లాదేశీ యువతి దుస్సాహసమే చేసింది. కోల్‌కతాలో ఉంటున్న ప్రియుడి కోసం భారత్ - బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో ఉన్న నదిని ఈదుకుంటూ మరీ ఇండియాలోకి అడుగుపెట్టింది. రాయల్ బెంగాల్ టైగర్స్‌కు ప్రసిద్ధి చెందిన సుందర్బన్ మడ అడవుల గుండా ఒంటరిగా, ధైర్యంగా ప్రయాణించి ప్రియుడి దరిచేరింది. యువతి పేరు క్రిష్ణ మండల్‌గా గుర్తించారు. ప్రియుడు అభిక్‌తో ఫేస్‌బుక్‌లో ఆమెకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని క్రిష్ణ డిసైడ్ అయ్యింది. అయితే పాస్‌పోర్ట్ లేకపోవడంతో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాలని భావించింది. ప్లాన్ ప్రకారం ఇరుదేశాల సరిహద్దులో ఉన్న నదిని దాదాపు గంటపాటూ ఈదుకుంటూ భారత్‌లో అడుగుపెట్టింది.


ఆ తర్వాత జరిగిందిదీ..

3 రోజుల క్రితం అభిక్ మండల్‌ను క్రిష్ణ పెళ్లి చేసుకుంది. కోల్‌కతాలోని కాళీఘట్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. అయితే భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సోమవారం అరెస్ట్ చేశారు. కాగా నిందితురాలు క్రిష్ణ మండల్‌ను బంగ్లాదేశ్ హై కమిషన్‌కు అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇమాన్ హుసేన్ అనే టీనేజర్ తనకిష్టమైన చాక్లెట్ కొనుక్కునేందుకు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. టీనేజర్ చొరబాటుని గుర్తించిన స్థానికులు టీనేజర్ హేసేన్‌ను స్థానిక పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-01T01:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising