ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే మరి.. బైక్‌పై వెనక కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండమనేది!

ABN, First Publish Date - 2022-09-02T02:37:20+05:30

మహిళలు బైక్ వెనక కూర్చున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే ఘటన ఇది. బైక్‌పై వెనక కూర్చున్న మహిళల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: మహిళలు బైక్ వెనక కూర్చున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే ఘటన ఇది. బైక్‌పై వెనక కూర్చున్న మహిళల చీర కొంగులు, చున్నీలు చక్రంలో చిక్కుకుని ప్రమాదాలు జరిగిన ఘటనలు కోకొల్లలు. తాజాగా ఓ వివాహిత ఇలానే మరణించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అమరావతి-నాగపూర్ హైవేపై గోండ్‌ఖైరీ గ్రామం వద్ద జరిగిందీ ఘటన.


బాధితురాలిని కోటల్ లోని గంగా నగర్‌కు చెందిన ప్రీతి పుచుల్ షిండే (22)గా గుర్తించారు. భర్త బైక్‌పై వెనక కూర్చున్న ఆమె చీర కొంగు బైక్ చైన్ వీల్‌కు చిక్కుకుపోవడంతో ఆమె అదుపుతప్పి కిందపడింది. వేగంగా వెళ్తున్న బైక్ పై నుంచి కింద పడడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడించింది. బైక్‌పై వెనక కూర్చున్నది ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా చీర ధరించినప్పుడు, చున్నీ ఉన్నప్పుడు వాటిని జారవిడవకుండా నడుముకు చుట్టుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2022-09-02T02:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising