ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SPపై Azam Khan పరోక్ష విమర్శలు

ABN, First Publish Date - 2022-05-22T20:56:42+05:30

నేను చాలా కాలం జైలులో ఉన్నాను. కానీ రాజకీయంగా ఏం జరిగిందో నాకు తెలియదు. కొన్ని బలమైన కారణాలో, బలవంతాలో ఉండి ఉంటాయి. నా వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు కానీ, వారి (ఎస్పీ) విధానాల్లో మార్పులేమీ కనిపించడం లేదు. చాలా కృషి చేశాను. చాలా విధేయంగా ఉన్నాను. కానీ నేనెందుకు నిరాదరణకు గురయ్యానో ఆలోచించుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఆ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ (Azam Khan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను చాలా కృషి చేశానని అయితే తానెందుకు నిరాదరణకు గురయ్యానో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని, జైలు జీవితంలో కూడా పార్టీనని పట్టించుకోలేదనే అసంతృప్తితో అజాంఖాన్ ఉన్నారని ఆయన సన్నిహితులు కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు. దీంతో జైలు నుంచి విడుదల అనంతరమే వేరే పార్టీలోకి వెళ్లనున్నట్లు గుసగుసలు సైతం వినిపించాయి. తాజా వ్యాఖ్యలు వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయి.


మీడియాతో అజాంఖాన్ మాట్లాడుతూ ‘‘నేను చాలా కాలం జైలులో ఉన్నాను. కానీ రాజకీయంగా ఏం జరిగిందో నాకు తెలియదు. కొన్ని బలమైన కారణాలో, బలవంతాలో ఉండి ఉంటాయి. నా వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు కానీ, వారి (ఎస్పీ) విధానాల్లో మార్పులేమీ కనిపించడం లేదు. చాలా కృషి చేశాను. చాలా విధేయంగా ఉన్నాను. కానీ నేనెందుకు నిరాదరణకు గురయ్యానో ఆలోచించుకోవాలి’’ అని అన్నారు.


సీతాపూర్ జైలు నుంచి శుక్రవారం అజాంఖాన్ విడుదల అయ్యారు. ఛీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రాంపూర్ కోర్టు అతన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల ఉత్తర్వులను గురువారం రాత్రి సీతాపూర్ జైలుకు పంపారు. దీంతో శుక్రవారం సీతాపూర్ జైలు తెరవగానే అజాం ఖాన్‌ను విడుదల చేశారు.

Updated Date - 2022-05-22T20:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising