ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాతో యుద్ధం చేయబోం: స్పష్టం చేసిన బ్రిటన్

ABN, First Publish Date - 2022-03-02T02:30:10+05:30

రష్యాతో తాము యుద్ధం చేయబోమని బ్రిటన్ రక్షణశాఖ కార్యదర్శి బెన్ వాల్లసె నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అయినప్పటికీ.. రష్యా విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బోరిస్ జాన్సన్ తీరు చూసి ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని బ్రిటన్‌ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో అవసరమైతే ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాతో యుద్ధానికి దిగడానికి బ్రిటన్ వెనకాడబోదని కొన్ని అనుమానాలు లేవనెత్తాయి. అంతలా కాకపోయినా ఉక్రెయిన్‌లో చొరబడిన రష్యా సైనికులపై అయినా పోరాడేందుకు బ్రిటన్ సహకరిస్తుందని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. అయితే, తాము రష్యాతో యుద్ధం చేయబోమని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తేల్చి చెప్పారు.


రష్యాతో తాము యుద్ధం చేయబోమని బ్రిటన్ రక్షణశాఖ కార్యదర్శి బెన్ వాల్లసె నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అయినప్పటికీ.. రష్యా విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బోరిస్ జాన్సన్ తీరు చూసి ఉక్రెయిన్‌కు మద్దతుగా బ్రిటన్ సైనిక సహాయం అందించొచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నిటికీ పుల్‌స్టాప్ పెడుతూ ఉక్రెయిన్‌కు తమ మద్దతు ప్రజాస్వామికంగానేనని, అయితే రష్యా సైనికులతో బలపరీక్షకు పోమని బోరిస్ జాన్సనే స్వయంగా ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2022-03-02T02:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising