ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ ఒవైసీని అరెస్ట్ చేస్తే రూ.22లక్షల reward ఇస్తాం...హిందూ నేత సంచలన ప్రకటన

ABN, First Publish Date - 2022-01-01T15:43:02+05:30

హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ ఎంపీ ఒవైసీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గురుగ్రామ్:హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన పోలీసు అధికారికి రూ.22 లక్షల నగదు బహుమతిని ఇస్తామని హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ ప్రకటించారు.హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహారాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు హిందూ సంస్థల సభ్యులు గురుగ్రామ్ వీధుల్లో ఆందోళన జరిపారు.డిప్యూటీ కమీషనర్ నివాసం ఎదురుగా ఉన్న ట్యాంక్ పార్క్ వద్ద వేలాది మంది హిందూ కార్యకర్తలు గుమిగూడి కాళీచరణ్‌ను విడుదల చేయాలని, ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 


దార్శనికులు, ఇతర మత పెద్దలకు జరిగిన అవమానాన్ని తాము సహించబోమని వారు చెప్పారు.‘‘ప్రతీ ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంది. ఒవైసీని పోలీసులు, ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు? ఒవైసీని పట్టుకున్న పోలీసు అధికారికి రూ. 22 లక్షలు ఇస్తాం ’’అని నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ తెలిపారు.ఈ రెండు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సుశీల్ కుమార్‌కు  సమర్పించారు.తాజాగా ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన తేదీ లేని వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ ప్రసంగం సందర్భంగా హిందువులను బెదిరించారని పలువురు రైట్ వింగ్ కార్యకర్తలు ఆరోపించారు. 


Updated Date - 2022-01-01T15:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising