ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Right To Information:భర్త ఆదాయ వివరాలు భార్య సమాచార హక్కు...ఐటీ శాఖకు సీఐసీ సంచలన ఆదేశం

ABN, First Publish Date - 2022-10-03T15:45:31+05:30

భర్త ఆదాయం విషయంలో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తాజాగా ఆదాయపు పన్నుశాఖ(I-T Department) సంచలన ఆదేశాలు జారీచేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భర్త ఆదాయం విషయంలో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తాజాగా ఆదాయపు పన్నుశాఖ(I-T Department) సంచలన ఆదేశాలు జారీచేసింది.  భార్య(Wife) భర్త(Husband) ఆదాయ వివరాలను సమాచార హక్కు చట్టం( Right To Information) ద్వారా 15రోజుల్లోగా ఐటీ శాఖ నుంచి పొందవచ్చని సీఐసీ(Central Information Commission) ఆదేశించింది.తన ఆదాయం గురించి భార్యకు వెల్లడించడానికి భర్త నిరాకరించాడు.దీంతో భార్య సమాచార హక్కు(ఆర్టీఐ) (RTI) ద్వారా పొందవచ్చని సీఐసీ పేర్కొంది. ‘‘మీరు ఎంత సంపాదిస్తారు?’’ వంటి ప్రశ్నలు భార్యలు భర్తలను అడుగుతుంటారు. కాని కొందరు తమ ఆదాయం గురించి చెప్పటానికి భర్తలు నిరాకరిస్తుంటారు.


భార్య సమాచార హక్కును ఉపయోగించి భర్త ఆదాయ వివరాలను(Husbands Income Details) పొందవచ్చని సీఐసీ ఆదేశాలు ఇచ్చింది. వివాహ వివాదం, విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నపుడు భార్యాభర్తల మధ్య ఆస్తుల విభజన, భరణం పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో భార్య తన భర్త నుంచి ఆదాయ వివరాలను కోరవచ్చు, భరణం డిమాండ్ చేయవచ్చు.భర్త ఆదాయ వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తే, భార్య  ఆర్టీఐ (సమాచార హక్కు) ద్వారా పిటిషన్ దాఖలు చేయడం ద్వారా తన భర్త ఆదాయ వివరాలను పొందవచ్చని సీఐసీ తెలిపింది.


 భర్త నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం వివరాలను 15 రోజుల్లోగా అందించాలని ఆదాయపు పన్ను శాఖను సీఐసీ ఆదేశించింది.సంజు గుప్తా అనే మహిళ తన జీవిత భాగస్వామి ఆదాయ వివరాలను కోరుతూ ఆర్టీఐ దాఖలు చేయడంతో సీఐసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 


Updated Date - 2022-10-03T15:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising