ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi and Putin : మోదీకి పుతిన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు?

ABN, First Publish Date - 2022-09-17T20:01:30+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌లో కలిశారు. మోదీ పుట్టిన రోజు శనివారం అని తెలిసినప్పటికీ పుతిన్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పలేదు. తన ప్రియ మిత్రునికి శుభాకాంక్షలు చెప్పకపోవడానికి కారణమేమిటో పుతిన్ వెల్లడించారు. 


ఉజ్బెకిస్థాన్‌ (Ujbekistan)లోని సమర్కండ్‌లో షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశం సందర్భంగా శుక్రవారం పుతిన్, మోదీ చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి ఇది సమయం కాదని, ఇది యుద్ధాలు చేసే కాలం కాదని మోదీ చెప్పారు. సాద్యమైనంత త్వరగా యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటామని పుతిన్ చెప్పారు. అయితే మోదీ పుట్టిన రోజు శనివారం అని పుతిన్‌కు తెలిసినప్పటికీ శుభాకాంక్షలు చెప్పలేదు. 


దీనిపై పుతిన్ వివరణ ఇచ్చారు. తాను తన ప్రియమిత్రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేకపోయానని తెలిపారు. భారత దేశానికి శుభాకాంక్షలు చెప్తున్నానని తెలిపారు. ‘‘నా ప్రియమిత్రుడా! నీవు రేపు (శనివారం) పుట్టిన రోజు జరుపుకోబోతున్నట్లు నాకు తెలుసు. అయితే రష్యన్ సంప్రదాయాల ప్రకారం మేము ముందుగా శుభాకాంక్షలు చెప్పము. కాబట్టి నేను ఆ పనిని ఇప్పుడు చేయలేను’’ అని తెలిపారు. స్నేహపూర్వక భారత దేశానికి శుభాకాంక్షలు చెప్పారు. మోదీ నాయకత్వంలో భారత దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 


Updated Date - 2022-09-17T20:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising