ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aamir Khan: అసోం పర్యటనను వాయిదా వేసుకోండి.. ఆమీర్‌ఖాన్‌కు అసోం సీఎం రిక్వెస్ట్

ABN, First Publish Date - 2022-08-13T00:08:17+05:30

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఈ వారం అసోంలో పర్యటించాల్సి ఉండగా, పర్యటనను వాయిదా వేసుకోవాలని అసోం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి: బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఈ వారం అసోంలో పర్యటించాల్సి ఉండగా, పర్యటనను వాయిదా వేసుకోవాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కోరారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ‘హర్ ఘర్ తిరంగ’ (Har Ghar Tiranga) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కాబట్టి తర్వాతి రోజులకు పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆమిర్‌ను సీఎం కోరారు. ‘లాల్‌సింగ్ చద్దా’ (Lal Singh Chaddha) ప్రచారంలో భాగంగా ఈ నెల 14న ఆమిర్ ఖాన్ గువాహటిలో పర్యటించాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి తాజా విజ్ఞప్తి నేపథ్యంలో ఆయన ఈనెల 16న గువాహటిలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఆమిర్ ఖాన్ ఇక్కడికి రావాలని అనుకుంటున్నారని, తనతో మాట్లాడారని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఈసారి దృష్టిమొత్తం స్వాతంత్ర్య దినోత్సవంపైనా, తిరంగ కార్యక్రమంపైనా ఉన్న నేపథ్యంలో అది పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతో తన పర్యటనను ఆగస్టు 15 తర్వాతి నాటికి వాయిదా వేసుకోమని కోరానని సీఎం పేర్కొన్నారు.


ఆమిర్ ఖాన్ ఎప్పుడొచ్చినా ఆయనతో కలిసి ముఖ్యమంత్రి సినిమా చూస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు ఆమిర్ ఖాన్ రూ. 25 లక్షల విరాళం అందించి ముఖ్యమంత్రి మనసులు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా వెల్లడించి ఆమిర్‌ను ప్రశంసించారు.

Updated Date - 2022-08-13T00:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising