ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంకీపాక్స్ నుంచి ‘కోతి’ని తొలగించేందుకు డబ్ల్యూహెచ్ఓ యత్నం

ABN, First Publish Date - 2022-06-15T22:12:14+05:30

మంకీపాక్స్ (Monkeypox) వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మంకీపాక్స్ (Monkeypox) వ్యాధిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (Global Health Emergency)గా ప్రకటించాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి అత్యవసర సమావేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వహిస్తోంది. అదే సమయంలో ఈ వ్యాధి పేరును మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఎటువంటి వివక్షకు, కళంకానికి దారితీయని రీతిలో పేరును నిర్ణయించాలని శాస్త్రవేత్తలు కోరుతున్న నేపథ్యంలో ఈ పరిశీలన జరుగుతోంది. 


WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ (Dr. Tedros Adhanom Ghebreyesus) ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, మంకీపాక్స్ వైరస్, దాని రూపాంతరాలు, వాటి వల్ల కలిగే వ్యాధి పేర్లను మార్చడంపై ప్రపంచంలోని సంబంధిత భాగస్వాములు, నిపుణులతో కలిసి డబ్ల్యూహెచ్ఓ కృషి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కొత్త పేర్ల గురించి ప్రకటనలను జారీ చేయబోతోంది. 


ఈ ఆలోచన ఎందుకు వచ్చింది?

ఆఫ్రికాతోపాటు ప్రపంచం నలుమూలలలోని దాదాపు 30 మంది శాస్త్రవేత్తలు మంకీపాక్స్ పేరును మార్చాలని కోరారు. ఈ వ్యాధి కారణంగా జరిగే నష్టం గురించి తెలియజేయడం కోసం ఎక్కువగా ఆఫ్రికన్ రోగుల చిత్రాలనే ప్రధాన మీడియాలో ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్‌కు రెండు రూపాలు ఉన్నాయని, అవి సెంట్రల్ ఆఫ్రికన్ (కాంగో బేసిన్), వెస్ట్ ఆఫ్రికన్ రూపాంతరాలని ప్రకటించింది. 


మంకీపాక్స్ మొదట ఎక్కడ ప్రారంభమైందనే అంశంపై స్పష్టత లేదు. అయితే దీనికి ఖండాంతరాల సంబంధం ఉందని, అంతకుముందు ఊహించినట్లుగా కాకుండా ఇది చాలా వేగంగా మానవులకు వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ అంతర్జాతీయ వ్యాధికి ఆఫ్రికా లేదా పశ్చిమ ఆఫ్రికా, లేదా నైజీరియాతో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. కాంగో బేసిన్ రూపాంతరానికి క్లేడ్ 1 అని, వెస్ట్ ఆఫ్రికన్ రూపాంతరాలకు క్లేడ్ 2, క్లేడ్ 3 అని నామకరణం చేయాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. 


Updated Date - 2022-06-15T22:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising