ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైని పేల్చేస్తాం

ABN, First Publish Date - 2022-08-21T06:32:55+05:30

దేశవాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబరు 26న సృష్టించిన మారణహోమాన్ని మరోసారి చేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. వర్లీలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మళ్లీ 2008 తరహా మారణహోమం

పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు వాట్సాప్‌ మెసేజ్‌

పాకిస్థాన్‌ నుంచే వచ్చినట్టు నిర్ధారణ

సందేశాల్లో కసబ్‌, జవహరీ పేర్ల ప్రస్తావన

ఆరుగురు ఉగ్రవాదులను రంగంలోకి దించినట్టు వెల్లడి

ముంబై పోలీసులు అలెర్ట్‌.. ఓ వ్యక్తి అరెస్ట్‌


ముంబై, ఆగస్టు 20: దేశవాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబరు 26న సృష్టించిన మారణహోమాన్ని మరోసారి చేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. వర్లీలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబరుకు వాట్సా్‌పలో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు పంపిన ఫోన్‌ కోడ్‌ పాకిస్థాన్‌కు చెందినదని ముంబై నగర పోలీసు కమిషనర్‌ వివేక్‌ ఫన్‌సల్కర్‌ తెలిపారు. మహారాష్ట్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవలో మూడు ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు బయటపడిన తర్వాతి రోజే ఈ హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. ఈసారి ఉగ్రదాడులకు ఆరుగురిని వినియోగించనున్నట్టు ఒక సందేశంలో పేర్కొనగా, ముంబైని పేల్చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయని మరో సందేశంలో ఉందని ఓ అధికారి చెప్పారు. విరార్‌ నగరంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు.   

Updated Date - 2022-08-21T06:32:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising