ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్

ABN, First Publish Date - 2022-03-02T21:35:48+05:30

దేశంలో ఒకే నెలలో 18 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. గత జనవరి 1 నుంచి 31 వరకు మంత్లీ రిపోర్ట్‌ను వాట్సాప్ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో ఒకే నెలలో 18 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. గత జనవరి 1 నుంచి 31 వరకు మంత్లీ రిపోర్ట్‌ను వాట్సాప్ వెల్లడించింది. తాజా రిపోర్ట్ ప్రకారం జనవరి నెలలో దేశంలో 18,58,000 వాట్సాప్ అకౌంట్స్‌ బ్యాన్ అయ్యాయి. ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్, రూల్ 4 (1)(డి) (ఐటీ)-2021 ప్రకారం దేశంలోని డిజిటల్ మీడియా సంస్థలు ప్రతి నెలా తమ రిపోర్ట్ విడుదల చేయాలి. వాట్సాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు లేదా దేశీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న అకౌంట్స్‌ను బ్యాన్ చేసే అధికారం వాట్సాప్ సంస్థకు ఉంది. దీని ప్రకారం గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సంస్థ, వివిధ అకౌంట్స్‌పై బ్యాన్ విధిస్తుంది. ఎవరైనా వాట్సాప్ యూజర్లు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఆధారంగా గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా కూడా రిపోర్ట్ చేసే వీలుంది.

Updated Date - 2022-03-02T21:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising