ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

National Herald Case : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులకు రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే...

ABN, First Publish Date - 2022-06-15T23:56:28+05:30

‘యంగ్ ఇండియన్’ నుంచి తాను కనీసం ఒక పైసా అయినా తీసుకోలేదని కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘యంగ్ ఇండియన్’ నుంచి తాను కనీసం ఒక పైసా అయినా తీసుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఆయనను మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. 


నేషనల్ హెరాల్డ్ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కాంగ్రెస్ ప్రమోట్ చేసిందని, దీనిలో ఆర్థిక అక్రమాలు జరిగాయని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీని సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను యంగ్ ఇండియన్ ప్రచురించేది. ఈ కంపెనీ లాభాపేక్షగల కంపెనీ కాదని రాహుల్ గాంధీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధనల క్రింద దీనిని నమోదు చేయించినట్లు చెప్పారని సమాచారం. దీని నుంచి తాను కనీసం ఒక పైసా అయినా తీసుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. 


రాహుల్ గాంధీ సమాధానాలపై  ఈడీ అధికారులు స్పందిస్తూ, 2010లో ప్రారంభించినప్పటి నుంచి ఈ కంపెనీ ద్వారా ఎటువంటి దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించలేదని  ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-06-15T23:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising