ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Al Qaeda Chief Killed : అల్ జవహరీని ఖతం చేయడంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందన ఇదీ..

ABN, First Publish Date - 2022-08-02T22:47:42+05:30

అల్ ఖైదా(Al Qaeda) చీఫ్ అయ్‌మాన్ అల్ జవహరీ(Zawahiri)ని తుదముట్టించడాన్ని అమెరికా(USA) మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) స్వాగతించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అల్ ఖైదా(Al Qaeda) చీఫ్ అయ్‌మాన్ అల్ జవహరీ(Zawahiri)ని తుదముట్టించడాన్ని అమెరికా(USA) మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) స్వాగతించారు. 9/11 దాడులు జరిగిన 20 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు జవహరీకి శిక్ష పడిందని హర్షం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకున్న జవహరీని డ్రోన్ దాడితో చంపేయడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ అఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని అమెరికా అణిచివేయగలదని చాటిచెప్పే రుజువు ఇది. 9/11 దాడుల బాధిత కుటుంబాలు, అల్‌ఖైదా పీడితులకు ఈ వార్త కాస్త మనశ్శాంతిని ఇస్తుందనుకుంటున్నాను. జవహరీని ఖతం చేసే క్షణాల కోసం 2 దశాబ్దాలపాటు పనిచేసిన ఇంటెలిజెన్సీ సభ్యులు, ఉగ్రవాద నిరోధక నిపుణులతోపాటు   అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తున్నా. కనీసం ఒక్క పౌరుడికి కూడా హాని జరగకుండా జవహరీని అంతమొందించిన తీరు ప్రశంసనీయం. ఉగ్రవాదనిరోధానికి శ్రమిస్తున్నవారికి నా అభినందనలు’’ అని ఒబామా వరుస ట్వీట్లు చేశారు.


కాగా అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీ(Zawahiri)ని డ్రోన్ దాడితో అమెరికా చాకచక్యంగా ఖతం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లో అల్ జవహరీ కదలికలపై కీలక సమాచారం అందుకున్న యూఎస్ ఇంటెలిజెన్స్ విభాగం(US intelligence) రహస్య ఆపరేషన్ నిర్వహించింది. కాబూల్ నగరంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ భవనంలో నివాసమున్నాడని గుర్తించింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశంతో దాడి చేసిన యూఎస్ ఆర్మీ పని ముగించింది. బాల్కనీలో ఉన్న జవహరీపై డ్రోన్ దాడి చేసి హతమార్చింది. ఈ దాడిలో జవహరీ కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదని యూఎస్ ఆర్మీ వెల్లడించింది.



Updated Date - 2022-08-02T22:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising