ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Railways : మే నెలలో ముంబై రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2022-06-04T22:19:45+05:30

పశ్చిమ రైల్వేలోని ముంబై డివిజన్ మే నెలలో సరికొత్త రికార్డును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : పశ్చిమ రైల్వేలోని ముంబై డివిజన్ మే నెలలో సరికొత్త రికార్డును సృష్టించింది. ముంబై సెంట్రల్ డివిజన్ ఏర్పాటైన తర్వాత ఇంత గొప్ప పని తీరు కనబరచడం ఇదే మొదటిసారి. ఇంతకీ ఏమిటి ఆ ఘనత అంటే... కట్టుదిట్టంగా తనిఖీలు చేసి టికెట్ లేకుండా ప్రయాణించినవారిని పట్టుకుని, వారి నుంచి రూ.12.24 కోట్లు వసూలు చేసింది. 


Western Railway Mumbai Division ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ, అనధికారిక ప్రయాణాలను నిరోధించేందుకు తాము కట్టుదిట్టంగా తనిఖీలను నిర్వహించామన్నారు. నిరంతరం టిక్కెట్ చెకింగ్ చేశామన్నారు. ఈ డివిజన్ ప్రారంభమైన తర్వాత 2022 మే నెలలో అత్యంత మెరుగైన పనితీరును ప్రదర్శించినట్లు తెలిపారు. టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.12.24 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. మే నెలకు తమకు నిర్దేశించిన లక్ష్యం రూ.1.26 కోట్లు అని, గతంలో రూ.9.4 కోట్లు వసూలు చేసి సృష్టించిన రికార్డును కూడా అధిగమించామని చెప్పారు. 


2022 ఏప్రిల్, మే నెలల మొత్తం క్యుములేటివ రెవిన్యూ రూ.21.65 కోట్లు అని చెప్పారు. 2021 ఏప్రిల్, మే నెలల్లో వసూలైనదాని కన్నా ఇది 821 శాతం అధికమని చెప్పారు. ఈ డివిజన్ కమర్షియల్ డిపార్ట్‌మెంట్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో ఈ రికార్డు సాధ్యమైందని చెప్పారు. 


ప్రయాణికులకు విజ్ఞప్తి 

సరైన, చెల్లుబాటయ్యే టిక్కెట్లు, ఐడీ కార్డులను అందుబాటులో ఉంచుకుని ప్రయాణించాలని ప్రయాణికులను వెస్టర్న్ రైల్వే కోరింది. 


Updated Date - 2022-06-04T22:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising