ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TMC Cabinet Reshuffle: మమత కేబినెట్‌లోకి తొమ్మిది కొత్త ముఖాలు.. ఆ బీజేపీ మాజీ కీలక నేతకు కూడా..

ABN, First Publish Date - 2022-08-03T23:03:55+05:30

పశ్చిమ బెంగాల్‌లోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో (Mamata Banerjee Cabinet reshuffle) కొత్త మంత్రులు కొలువుదీరారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో (Mamata Banerjee Cabinet reshuffle) కొత్త మంత్రులు కొలువుదీరారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తొమ్మిది మంది కొత్త వారికి మంత్రులుగా (Nine New Ministers) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అవకాశం ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత టీఎంసీ నేత బాబుల్ సుప్రియోను (Babul Supriyo) కూడా మమత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. బాబుల్ సుప్రియో 2021 సెప్టెంబరులో టీఎంసీలో చేరారు. బల్లిగుంజే శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి సుబ్రత ముఖర్జీ మరణించడంతో ఆ స్థానం నుంచి బాబుల్ పోటీ చేసి, విజయం సాధించారు.



బాబుల్ సుప్రియోతో పాటు స్నేహశీష్ చక్రవర్తి, పార్థా బౌమిక్, ఉదయన్ గుహ, ప్రదీప్ మజుందర్ మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో ఉన్నారు. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులగా బిర్బహ హన్సంద, బిప్లబ్ రాయ్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. తజ్మల్ హుస్సేన్, సత్యజిత్ బర్మన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మమత బెనర్జీ సమక్షంలో గవర్నర్ లా గణేషన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. టీఎంసీలో సీనియర్ మంత్రిగా పనిచేసిన పార్థా ఛటర్జీని (Partha Chatterjee) ఈడీ అరెస్ట్ చేసిన పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగడం గమనార్హం.



టీఎంసీ సీనియర్ నేత ఒకరు ఈ పునర్‌వ్యవస్థీకరణపై మాట్లాడుతూ.. కొత్త కేబినెట్‌లో యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని మమత భావించారని, ఆ ఆలోచనలో భాగంగానే బాబుల్ సుప్రియో, పార్థా భౌమిక్, స్నేహశీష్ చక్రవర్తికి మంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. మరికొందరు టీఎంసీ నేతలు మాట్లాడుతూ.. మమత కేబినెట్‌లో గత 11 ఏళ్లుగా కోల్‌కత్తాకు చెందిన వారికే పదవులు దక్కాయని.. ఈసారి జిల్లాల్లో నేతలకూ అవకాశం ఇవ్వాలనే వ్యూహంలో భాగంగానే కొత్తగా కొందరికి మంత్రి పదవులు దక్కాయని తెలిపారు. పార్థా భౌమిక్, ఉదయన్ గుహ, స్నేహశీష్ చక్రవర్తి, బిప్లబ్ రాయ్ చౌదరి, సత్యజిత్ బుర్మాన్, తజ్మల్ హుస్సేన్ లాంటి జిల్లాల నేతలను మమత తన కేబినెట్‌లోకి తీసుకోవడానికి కారణం ఇదేనని చెబుతున్నారు.

Updated Date - 2022-08-03T23:03:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising