ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వారాంతపు కర్ఫ్యూ’తో భారీ నష్టం

ABN, First Publish Date - 2022-01-11T16:57:25+05:30

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను నియంత్రించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాంతపు కర్ఫ్యూతో రాజధాని పూర్తిగా స్తంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా రెండు రోజుల పాటు వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు వేల కోట్లరూపాయల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- చేజారిన రూ. 1000 కోట్ల జీఎస్టీ 

- వాణిజ్య వర్గాల అంచనా


బెంగళూరు: కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను నియంత్రించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాంతపు కర్ఫ్యూతో రాజధాని పూర్తిగా స్తంభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా రెండు రోజుల పాటు వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు వేల కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సినిమా, హోట ల్స్‌, మాల్స్‌, పర్యాటకం, బార్లు, కల్యాణ మండపాలు, ప్రైవేటు రవాణా రంగం, మార్కెట్ల నుంచి ఈ రెండు రోజుల్లో జీఎస్టీ రూపంలో ఎంతకాదన్నా రూ.1000 కో ట్లు ప్రభుత్వం చేజారాయని వాణిజ్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటక వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ ఐఎస్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ సహజంగా వారాంతపురోజుల్లో ప్రజలు పర్యాటక కేంద్రాలకు, హోటళ్లు, మాల్స్‌ సందర్శనకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని, ఈ లెక్కన ఒక పర్యాటక రంగానికే ‘వీకెండ్‌ కర్ఫ్యూ’ కారణంగా కనీసం రూ.300 కోట్ల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కాగా హోటల్‌ రంగానికి ఈ రెండు రోజుల పాటు ఎంత కాదన్నా కనీసం రూ. 200  కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని బెంగళూరు నగర హోటల్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు పీసీ రావ్‌ పేర్కొన్నారు. సినిమా థియేటర్లకు కూడా వారాంతపు రోజుల్లో వచ్చేవారి సంఖ్య కాస్త అధికమే. ఈ లెక్కన థియేటర్ల నిర్వహకులకు కూడా కోట్లలోనే నష్టం వాటిల్లిందని చందనసీమ వర్గాలు అంటున్నాయి. వారాంతపు లాక్‌డౌన్‌ కారణంగా చిరువ్యాపారులు, నిరుపేదలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లలో దూరప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రయాణికులు సైతం బస్సులు లేక ఇబ్బంది పడ్డారు. కనీసం ఈసారైనా వారాంతపు కర్ఫ్యూ వల్ల ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-01-11T16:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising