ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hijab ధరించడం మతపరమైన ఆచారం కాదు...

ABN, First Publish Date - 2022-03-15T16:33:06+05:30

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉడిపి కాలేజీ అమ్మాయిల పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది.‘‘ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదు. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే, దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’’ అని హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పులో పేర్కొంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్ అని, దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది.




హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10వతేదీ హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వతేదీన తీర్పును రిజర్వ్ చేసింది. పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది.దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు. కౌంటర్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది.


దీంతో కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. కాగా కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.


Updated Date - 2022-03-15T16:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising