ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా బలగాలను తిప్పికొట్టాం

ABN, First Publish Date - 2022-09-13T10:30:36+05:30

రష్యా బలగాలను తమ ఈశాన్య సరిహద్దు వరకూ వెనక్కి తిప్పికొట్టామని ఉక్రెయిన్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడి

ఖార్కివ్‌లో 80శాతం విద్యుత్‌, నీటి సౌకర్యాల పునరుద్ధరణ

ఖార్కివ్‌, సెప్టెంబరు 11: రష్యా బలగాలను తమ ఈశాన్య సరిహద్దు వరకూ వెనక్కి తిప్పికొట్టామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. పలు గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తాము ఊహించని విధంగా ఉక్రెయిన్‌ ఇటీవల ఒక్కసారిగా మెరుపు ప్రతిస్పందనతో దాడి చేయడంతో రష్యా బలగాలు షాక్‌ తిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెనక్కి వెళ్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ బలగాలు రెట్టించిన ఉత్సాహంతో ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం కనిపించిన రష్యా బలగాలు, సాయంత్రానికి గట్టిగా అరుచుకుంటూ తమ వాహనాల్లో హడావుడిగా వెనక్కి వెళ్లిపోయాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఒక్కరోజులోనే సుమారు 20 ప్రాంతాలను రష్యా నుంచి విడిపించుకున్నామని ఉక్రెయిన్‌ సాయుధ బలగాల జనరల్‌స్టాఫ్‌ తెలిపారు. ఖార్కివ్‌లో 80శాతం ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు తిరిగి మామూలు స్థాయికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తన ట్విటర్‌లో ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ‘‘చలి, ఆకలి, చీకటి, దాహం వంటివేమీ మీ స్నేహం కంటే ప్రమాదం కాదు. మేం ఇంధనం, విద్యుత్‌, నీరు, ఆహారంతో.. ‘మీరు లేకుండా’ ఉంటాం’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. రష్యాలో సైనిక నిపుణుల నుంచి అధినాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు బలగాలను మోహరించడంలో, ఉక్రెయిన్‌పై బలమైన చర్య తీసుకోవడంలో క్రెమ్లిన్‌ విఫలమైందని నిపుణులు ప్రభుత్వ నియంత్రిత టీవీల్లోనే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక నికొపొల్‌ ప్రాంతంపై రష్యా బాంబు దాడి కొనసాగుతోంది. ఐరోపాలోనే అతిపెద్ద అణుకేంద్రం జపోరిజ్‌జియా, ఇక్కడే ఉండటంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. 

Updated Date - 2022-09-13T10:30:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising