ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామసేతును గాసిప్ అనుకుంటున్నారు: మోహన్ భాగవత్

ABN, First Publish Date - 2022-03-02T01:00:47+05:30

దేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురువుగా నిల్చోబెట్టాలి. భారతదేశ ఖ్యాతిని నిర్మించాలంటే, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగిన విధానాల్ని, సత్యాల్ని ప్రజలకు తెలియజేయాలి. ఇందుకు విద్యావంతులు పూనుకుంటే మన దేశ ప్రాచీనత గురించి ప్రజల్లో మరింత అవగాహన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రామసేతు గురించి మాట్లాడుతుంటే ప్రజలు దాన్ని కల్పితమని అనుకుంటున్నారని, ఆధారలతో సహా దానిని చూపించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ అన్నారు. దేశ ప్రాచీన గొప్పతనాన్ని విద్యావంతులు వెలికి తీసి పుస్తక రూపం ఇవ్వాలని, అలా దేశ చరిత్రలో మరుగున పడిన అనేక అంశాలను విశ్వసనీయతతో ప్రజలకు అందించగలమని ఆయన అన్నారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.


‘‘దేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురువుగా నిల్చోబెట్టాలి. భారతదేశ ఖ్యాతిని నిర్మించాలంటే, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగిన విధానాల్ని, సత్యాల్ని ప్రజలకు తెలియజేయాలి. ఇందుకు విద్యావంతులు పూనుకుంటే మన దేశ ప్రాచీనత గురించి ప్రజల్లో మరింత అవగాహన, నమ్మకాన్ని కల్పించగలం. ప్రతిదాన్ని ఆధారాలతో సహా పుస్తకాలు ముద్రించాలి. దేనికైనా ఆధారం తప్పనిసరి. ఉదహారణకి.. మనం రామసేతు గురించి మాట్లాడితే ప్రజలు దాన్ని కల్పితమని అనుకుంటున్నారు. కానీ రామసేతుకు సంబంధించిన ఆధారాలను మనం చూపించగలగాలి’’ అని మోహన్ భాగవత్ అన్నారు.

Updated Date - 2022-03-02T01:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising