ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాలో కాంగ్రెస్ కలిసిరాలేదు: సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2022-01-19T17:38:44+05:30

మహారాష్ట్ర తరహాలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహారాష్ట్ర తరహాలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను కలుపుకొని 'మహా వికాస్ అఘాడి'గా ఏర్పడాలని శివసేన, ఎన్‌సీపీ అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. గోవా ఎన్నికల్లో శివసేన, ఎన్‌సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తోంది. దీనిపై సంజయ్ రౌత్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో తాము చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదని చెప్పారు. మహారాష్ట్ర తరహాలోనే మహాకూటమి ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్‌సీపీ ప్రయత్నం చేశాయన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలు సొంతంగానే మెజారిటీ తెచ్చుకోగలమనే అభిప్రాయంతో ఉన్నారని ఆయన చెప్పారు.


అధిష్ఠానానిదే నిర్ణయం: నానా పటోలే

కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయించాల్సింది అధిష్ఠానమేనని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని నిలువరించేందుకు వారికి (శివసేన, ఎన్‌సీపీ) సోనియాగాంధీ సహాయపడ్డారని, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగున్నందున వారిని కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్యత లేదని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Updated Date - 2022-01-19T17:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising