ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srilanka లో Petrol ఖాళీ.. ఒక్కరోజుకు సరిపడ మాత్రమే ఉంది : కొత్త ప్రధాని విక్రమసింఘే ప్రకటన

ABN, First Publish Date - 2022-05-17T02:41:35+05:30

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో (Financial crisis) కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పెట్రోల్ పూర్తిగా అడుగంటుకుంది. కేవలం ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే ఉందని ఆ దేశ కొత్త ప్రధానమంత్రి విక్రమసింఘే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో (Financial crisis) కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పెట్రోల్ పూర్తిగా అడుగంటుకుంది. కేవలం ఒక్కరోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే ఉందని ఆ దేశ కొత్త ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. అత్యవసర పెట్రోల్ దిగుమతులపై చెల్లింపులకు అవసరమైన డాలర్లు లభ్యమవ్వడంలేదని తీవ్రతను వివరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు.  దేశంలో పెట్రోల్ అయిపోయింది. ప్రస్తుతం ఒకరోజుకు సరిపోయే నిల్వ మాత్రమే ఉంది. రానున్న నెలల్లో తమ జీవితాల్లో అతిపెద్ద కష్టాలు ఎదుర్కోబోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


3 షిప్‌మెంట్ల ఆయిల్ దిగుమతిపై చెల్లింపులకు అవసరమైన డాలర్లను ప్రభుత్వం సేకరించలేకపోతోందని చెప్పారు. రవాణా నౌకలు బయలుదేరేందుకు సిద్ధంగానే ఉన్నాయి. కానీ చెల్లింపులు చేయకపోవడంతో కొలంబో వెలుపల నిలిచివున్నాయని విక్రమసింఘే వెల్లడించారు. కాగా చరిత్రలో ఎన్నడూ చూడని ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక  కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 2.2 కోట్ల మంది అక్కడి ప్రజలు ఆహారం, ఇంధనం, మెడిసిన్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రికార్డ్ స్థాయిలో ద్రవ్యోల్బణంతోపాటు  చాలా ఎక్కువ సేపు కరెంట్ కోతలను జనాలు అనుభవిస్తున్నారు. కాగా మహింద రాజపక్స తొలగింపు అనంతరం గత గురువారమే శ్రీలంక కొత్త ప్రధానిగా విక్రమ సింఘే పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-17T02:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising