ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలేష్‌ యాదవ్‌పై పోటీ చేయబోం: కాంగ్రెస్

ABN, First Publish Date - 2022-02-03T00:19:26+05:30

అఖిలేష్ యాదవ్ ఖర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలోకి దిగబోతున్నారు. ఇక ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత శివపాల్ సింగ్ యాదవ్ జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ సహా ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌పై తమ పార్టీ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టలేదని కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ చెప్పుకొచ్చారు. అఖిలేష్‌పై అభ్యర్థిని ప్రకటించకపోవడానికి గల కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎస్పీ ఎవరినీ బరిలోకి దించలేదని అందుకే తాము అఖిలేష్, శివపాల్‌పై తమ అభ్యర్థులను దింపడం లేదని ప్రకటించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే ఎస్పీపై పోటీకి దిగినప్పటికీ ఎస్పీ అధినేతపై పోటీకి దూరంగా ఉండడం విశేషం.


అఖిలేష్ యాదవ్ ఖర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం బరిలోకి దిగబోతున్నారు. ఇక ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత శివపాల్ సింగ్ యాదవ్ జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని నిలబెట్టలేదట. 2004, 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఎస్పీ అభ్యర్థుల్ని నిలబెట్టలేదని, అందుకే తాము కూడా ఎస్పీ అధినేతపై అభ్యర్థిని నిలబెట్టబోమని పైలట్ వివరించారు.

Updated Date - 2022-02-03T00:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising